ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు | - | Sakshi
Sakshi News home page

ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు

Oct 24 2025 2:22 AM | Updated on Oct 24 2025 2:22 AM

ఎట్టి

ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు

ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు

చెత్త కుప్పల మధ్య ముగ్గురు బిడ్డలతో ఓ తల్లి జీవనం

మతిస్థిమితం లేక తిప్పలు

పగటి పూట ఎక్కడెక్కడో తిరిగి రాత్రి చల్లవానిపేట చేరుతున్న వైనం

ఆదుకోవాలని కోరుతున్న స్థానికులు

ఆకలి అని చెప్పడం తప్ప అయిన వారి గురించి చెప్పడం ఆమెకు తెలీదు. పద్మ, బోడెమ్మ, కరువమ్మ అని

పిల్లల్ని పిలవడం తప్ప చిరునామా చెప్పేంత తెలివి ఆమెకు లేదు.

స్నానపానాదుల పట్టింపు అసలే లేదు. మట్టి కలిసిన మెతుకులైనా మహా

ప్రసాదంగా తీసుకోవడమే తెలుసు. స్థానికులు కనికరిస్తే ఆ పూట కడుపు నిండుతుంది. లేదంటే ఎండిన డొక్కల

వెక్కిరింపులు తప్పవు.

చల్లవానిపేటలో మూడేళ్లుగా

కనిపిస్తున్న ఓ తల్లి ముగ్గురు

బిడ్డల కథ ఇది.

జలుమూరు:

మూడేళ్ల కిందట చల్లవానిపేటకు ఓ తల్లి తన బిడ్డలతో వచ్చింది. అప్పటి నుంచి ఆ చెత్త కుప్పలే ప్రపంచంగా బతుకుతోంది. చెత్త సేకరణ కేంద్రంలోనే తల దాచుకుంటోంది. ఒక రోజు మాది బుడితి దగ్గర బద్రి గ్రామం అని చెబుతారామె. మరోరోజు మా ఊరు సుబ్రహ్మణ్యపురం అంటా రు. ఇంకోరోజు నేను ఈదులవలస నుంచి వచ్చానంటారు. మాటలో స్థిమితం లేదు. చేతల్లోనూ స్థిరత్వం లేదు. కట్టుకున్న వారు ఎవరో, కన్నవారు ఎవరో కూడా ఆమె చెప్పలేకపోతున్నారు. రోజంతా ఎటో తిరగడం పొద్దుపోయే వేళకు ఈ చెత్త కుప్పల మధ్యకు చేరుకోవడం, స్థానికులు ఏదైనా పెడితే తినడం, లేదంటే పస్తులుండడం ఆమె దినచర్య. మూడేళ్లుగా స్థానికులకు కనిపిస్తున్న దృశ్యాలివే. పిల్లల పేర్లు మాత్రం పద్మ, బోడెమ్మ, కరువ మ్మ అని చెబుతున్నారు. తల్లి పేరు లక్ష్మి అని కూడా చెబుతున్నారు. ఈ తల్లీబిడ్డల వద్ద ఎలాంటి వస్తువులు ఉండవు. కేవలం చేతి సంచీ, అందులో కొన్ని దుస్తులు మాత్రమే కనిపిస్తున్నాయి. రేషన్‌ కార్డు, ఆధార్‌ వంటి గుర్తింపు కార్డులేవీ లేవు. రెండేళ్ల కిందట ఈమె గర్భిణిగా ఉన్న సమయంలో పురిటి నొప్పులు వస్తే స్థానిక ఆశా కార్యకర్త నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించినట్లు సమాచారం.

పాపం చిన్నారులు..

ఈ తల్లికి ముగ్గురూ ఆడ పిల్లలే. ముగ్గురూ ఏడేళ్ల వయసు లోపు వారే. ఎవరైనా ఏదైనా ఇస్తే తినడం, లేదంటే పరధ్యానంగా ఎటో చూస్తూ కూర్చోవ డం చేస్తుంటారు. వర్షం పడితే చాలు రోడ్డు మీద ప్రవహించే నీటిలో స్నానాలు చేస్తారు. అటుగా వెళ్తున్న వారు చూసి పాపం అంటూ నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. స్థానిక సర్పంచ్‌ పంచిరెడ్డి రామచంద్రరావు చొరవ తీసుకుని రోజూ ఉదయం పూట టిఫిన్‌ పెట్టి వారి కష్ట సుఖాలు అడుగుతుంటారు. అలాగే సీడీపీఓ వంశీప్రియకు సమాచారం ఇచ్చానని తెలిపారు. దీనిపై సీడీపీఓ వంశీ ప్రియ మాట్లాడుతూ సమాచారం వచ్చిన వెంటనే వారు ఎక్కడ ఉంటారో అడ్రస్‌ ఆరా తీస్తున్నామని, దొరికిన వెంటనే పిల్లలను హోమ్‌కు తరలించి వారికి వసతి, చదువు తదితర ఏర్పాట్లు చేస్తామన్నారు. తల్లికి ఉన్నతాఽధికారులతో మా ట్లాడి అవసరమైన వైద్యం అందిస్తామన్నారు.

ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు 1
1/2

ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు

ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు 2
2/2

ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement