అపూర్వ ఆదరణ
● మెడికల్ కాలేజీలు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకోవడం దారుణం ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
పోస్టర్ ఆవిష్కరణలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తదితరులు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ):
పేదవారి కోసం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే వాటిని అమ్మి సొ మ్ము చేసుకోవాలనుకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో పేదల కోసం ఆలోచన చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదని గుర్తు చేశారు. తన తాబేదారులకు మెడికల్ కాలేజీలు అప్పగించి జేబులు నింపుకోవాలనే ఆలోచన పక్కన పెట్టాలని హితవు పలికారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న నిర్వహించనున్న కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని పేర్కొన్నారు. ఓ ఉద్యమంలా కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఈ నెల 28 లోపు కోటి సంతకాలు పూర్తి చేసి గవర్నర్‌ను కలిసి పరిస్థితి వివరిస్తామన్నారు. ప్రజాఉద్యమం బలపడి ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాడుతామని తెలిపారు. చంద్రబాబు వైఫల్యాల్ని అందరికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కాళింగకుల, వెలమ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణ రావు, అంబటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యద ర్శి కేవీజీ సత్యన్నారాయణ, కరిమి రాజేశ్వరరా వు, శాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రాష్ట్రకార్యవర్గసభ్యు లు గొండు కృష్ణమూర్తి, చల్ల శ్రీనివాసరావు, జి ల్లాపార్టీ ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనంజయరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, మహిళావిభాగం రాష్ట్ర కార్యదర్శి కొర్ల శిరీష, గ్రీవెన్స్ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు రౌతు శంకరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృధ్వి, గొండు రఘురాం, సాధు వైకుంఠరావు, గుండ భాస్కర్, లుకలాపు గోవిందరావు, వజ్జ వెంకటసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


