
ఉత్సాహంగా క్విసిక్ ఫాల్ ఉత్సవం
ఎచ్చెర్ల: స్థానిక ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న క్విసిక్ ఫాల్ ఉత్సవం రెండో రోజు బుధవారం క్వాంటమ్ కంప్యూటింగ్ క్విసిక్ ఫాల్ నూతన ఆవిష్కరణలకు వేదికై ంది. దీనిలో భాగంగా అస్ట్రేలియా బాండ్ యూనివర్సిటీ సొసైటీ అండ్ డిజైన్ ఫ్యాకల్టీ సహ ఆచార్యులు గ్రెగొరీ జె.స్కుల్మోస్కీ ఆన్‌లైన్‌లో అతిథి ఉపన్యాసం ఇచ్చారు. కోల్‌కత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ)కు చెందిన క్రిప్టాలజిస్ట్ సమాచార సిద్దాంత నిపుణుడు డాక్టర్ గౌతమ్‌పాల్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీలో వస్తున్న కొత్త అంశాలు, సమాచార భద్రతపై వాటి ప్రభావాన్ని వివరించారు. డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ మాట్లాడుతూ ఈ శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు క్వాంటమ్ ప్రోగ్రామింగ్, సమస్యల పరిష్కారంపై మెరుగైన అవగాహన లభించిందన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఆర్థికాధికారి వాసు, సమన్వయకర్త గేదెల రవి, కంప్యూటర్ శాస్త్ర విభాగాదిపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు.