
ప్రతిష్టాత్మకంగా కార్తీక మాసోత్సవాలు
టెక్కలి: రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయ సన్నిధిలో కార్తీక మాసోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణపై బుధవారం ఆలయ ప్రాంగణంలో అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు సోమవారాలు జరగనున్న ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సుమారు రూ.5 కోట్లతో మల్లన్న ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, డీఎస్పీ డి.లక్ష్మణరావు, ఏఎంసీ చైర్మన్ బి.శేషగిరి, తహసీల్దార్ బి.సత్యం, ఆలయ ఈఓ జి.గురునాధరావు, నాయకులు ఎల్.ఎల్.నాయుడు, బి.జగదీష్, కె.కిరణ్, ఎం.సుందరమ్మ, ఎం.దమయంతి పాల్గొన్నారు.