
27 నుంచి మల్లన్న సన్నిధిలో కార్తీక సోమవారాలు
టెక్కలి: కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 27 నుంచి టెక్కలి మండలం రావివలస శ్రీ ఎండల మల్లికార్జునస్వామి సన్నిధిలో కార్తీక సోమవారాలు పూజలు నిర్వహించనున్నారు. 27న మొ దటి సోమవారం, నవంబర్ 3న రెండో సోమవారం, 11న మూడో సోమవారం, 17న నాల్గో సోమవారాల ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శీర్షాభిషేకం టికెట్ ధర రూ.40, ప్రత్యేక దర్శనం టికెట్ ధర రూ.20, కేశఖండన రూ.40, రుద్రాభిషేకం రూ.58 చొప్పున దేవ స్థానంలో టికెట్ ధరలు నిర్ణయించారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా స్వామికి సేవలు చేయవచ్చునని దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఆర్టీసీలో 23 కేటగిరీల్లో పదోన్నతులు
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళంలోని ఆర్టీసీ సంస్థలో 23 కేటగిరీలకు చెందిన వివిధ ఉద్యోగులకు త్వరలో పదోన్నతి ఉత్త ర్వులు ఇస్తామని జిల్లా ప్రజా రవాణా అధికా రి సీహెచ్ అప్పల నారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. అర్హత కలిగిన ఉద్యోగులకు నియమ,నిబంధనల మేరకు పదోన్నతులు ఇచ్చే ప్రక్రియపై జిల్లా పదోన్నతుల కమిటీ ఆధ్వర్యంలో పూర్వపు ప్రాంతీయ మేనేజర్ కార్యాలయం విజయనగరంలో పూర్తి కసరత్తు జరుగుతుందన్నారు. సుమారు 264 మందితో పాటు మరో 38 మంది (10 శాతం రిజర్వ్) మొత్తం 302 మంది ఉద్యోగులకు రెండు లేదా మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
‘సహకార’ ఉద్యోగులకు శిక్షణ
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం డీసీసీబీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సహకార శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని సహకార శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సర్‌చార్జి, అవార్డు, ఈపీలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి బి.మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రామదాసు సహకార శిక్షణ కేంద్రం, రాజమహేంద్రవరం ప్రిన్సిపాల్ గండేపల్లి శ్రీనివాసరావు శిక్షణ విశిష్టతను వివరించారు.
శ్రీకాకుళం నగరంలో..