
అమరులకు అశ్రు నివాళి
● ఘనంగా పోలీసు అమరవీరుల స్మారకోత్సవాలు
● పోలీసుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం క్రైమ్ : పోలీసులు సమర్థంగా పనిచేస్తే సమాజానికి మేలు జరుగుతుందని, ఎందరో పోలీసులు విధుల్లో అసువులు బాసి అమరులయ్యారని, వారిని నివాళులర్పించడం మన బాధ్యత అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసు అ మరవీరుల స్మారకోత్సవం తొలిరోజు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీలతో కలసి అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి పూలమాలలతో నివాళుర్పించారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. ఏఆర్ దళాల పరేడ్ ఆకట్టుకుంది.
మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి..
అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళలపై అ త్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, గంజాయి, డ్రగ్స్‌మత్తులో యువత చెడిపోతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కృషి చేయాలన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం బాధితులుగా మారుతున్నారని, వారికి అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ క్వార్టర్లు, స్టేషన్లు పోలీస్ హౌసింగ్ కా ర్పొరేషన్ ద్వారా నిర్మించేలా నివేదిస్తానన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు, సేవలు మరువలేనివన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది దేశంలో 191 మంది పోలీసులు విధుల్లో మరణించారని, ఏపీలో ఇద్దరు మరణించారన్నారు. జిల్లాలో అమరులైన ఆరు కుటుంబాలకు కారుణ్య నియామకాల్లో కొనసాగుతున్నారని, మరణించిన హోంగార్డు కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్ జాబ్ వచ్చే లా కార్యాచరణ చేస్తున్నామన్నారు. విధుల్లో భాగంగా అసాంఘిక శక్తుల నడుమ ఉండేటప్పుడు జాగ్రత్తలు వహించాలని, శాఖాపరంగా మద్దతిస్తామన్నా రు. ఆరోగ్య భద్రత పరంగా పెండింగ్ బిల్లులు లేవని, ఐదు కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇస్తామన్నా రు. ప్రమాద ఇన్స్యూరెన్సులు, బ్యాంకులతో టైఅప్ ఇన్స్యూరెన్సులు చేయిస్తున్నామన్నారు.