
ఘనంగా క్విసిక్‌ఫాల్ ఫెస్ట్ ప్రారంభం
ఎచ్చెర్ల: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో (ఐఐఐటీ) శ్రీకాకుళం క్విసిక్ ఫాల్ ఫెస్ట్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. అమరావతి క్వాంట్‌ం వ్యాలీ సలహాదారులు, నిపుణులు డాక్టర్ వెంకటసుబ్రమణ్యం ముఖ్య అతిథిగా పా ల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఈ ఫెస్ట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా 55 విద్యా సంస్థలను ఈ ఫెస్ట్‌కు ఎంపికచేయగా వాటిలో శ్రీకాకుళం ట్రిఫుల్‌ఐటీ ఒకటిగా నిలిచిందన్నారు. విద్యార్థులు కాటం నిఖిల్‌తేజ, దూదేకుల కాసింవలి, చెరుకూరి ప్రవీణ్ కుమార్, చదువుల జాన్‌బాబు, కిమిడి గుణశ్రీల ప్రజెంటేషన్ ఈ ఘనత తీసుకువచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్క్‌షాప్‌లు, గైడెడ్ జూపిటర్ నోట్‌బుక్‌లు, క్యాంపస్ హ్యకథాన్‌లు, క్వాంటమ్ రీసెర్చ్‌పై నిపుణుల ప్రసంగాలు ఉంటాయని అన్నారు. కా ర్యక్రమంలో వైజాగ్ ఎంపీ, గీతం విద్యాసంస్థల అధినేత శ్రీభరత్ మాట్లాడుతూ ఆర్టీయూకేటీ ఎంపికపై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ కేవీజీ బాలాజీ మాట్లాడుతూ ఇది మన క్యాంపస్‌కు వ చ్చిన మంచి అవకాశమని, విద్యార్థులు వినియోగించుకోవాలని అన్నారు.