
ఈదురుగాలులతో తీరని నష్టం
హిరమండలం: ఇటీవల కురిసిన వర్షాలకు, ఈదురుగాలులకు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం వరి పొట్ట దశకు మించి పక్వానికి వచ్చింది. ఈ క్రమంలో చేను బరు వెక్కి నేలవాలింది. దీంతో మట్టిలో, నీటిలో కంకులు నానుతున్నాయి. దీంతో మొలకలు వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌ఎన్‌పేట మండలం దబ్బపాడు, తురకపేట సమీపంలో వరికి నష్టం ఎక్కువగా వాటిల్లుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
దళితులపై వివక్ష..
త్రిసభ్య కమిటీ విచారణ
కంచిలి: మండలంలోని జిల్లుండ గ్రామంలో నివసిస్తున్న దళిత కుటుంబాల పట్ల అదే గ్రామంలో ఉన్న అగ్రకులాల వారు వివక్ష ప్రదర్శిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు మండల త్రిసభ్య కమిటీ అధికారులు మంగళవారం గ్రామంలో విచారించారు. గ్రామంలో గల దేవాలయానికి రానివ్వడం లేదని, అంగన్‌వాడీ కేంద్రంలోను, మంచినీటి బోరు వద్ద దళితుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించడంపై, రెండు వర్గాలను ఒక చోట కూర్చోబెట్టి సమన్వయం చేశారు. ఇకముందు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని హెచ్చరించారు. విచారణలో స్థానిక తహసాల్దార్ ఎన్.రమేష్‌కుమార్, ఎంపీడీఓ వి.తిరుమలరావు, ఎస్‌ఐ పి.పారినాయుడు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ ధనలక్ష్మి, దళిత సంఘాల నేతలు నగిరి మోహనరావు, గుండ్ర జగ్గారావు, సిర్ల మాధవరావు, డొప్ప వెంకటరావు, రుక్మంగధరావు, బడియా నాగరాజు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం రూరల్: స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడు నర్తు రామారావు యాదవ్ 23వ సారి యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ యాదవ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు, యానాం రాష్ట్ర అధ్యక్షుడు మట్ట సురేష్ యాదవ్ అధ్యక్షతన సోమవారం యానాంలో జరిగిన ఏపీ, పుదుచ్ఛేరి రాష్ట్రాల సంయుక్త అఖిల భారతీయ యాదవ మహాసభలో శ్రీకాకుళం జిల్లా యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని జాతీ య ప్రధాన కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్ ప్రకటించారు. జిల్లా యాదవ యువజన అధ్యక్షుడిగా నర్తు ప్రేమ్‌కుమార్ యాదవ్, జాతీయ యువజన కార్యదర్శిగా కొర్రాయి వాసుదేవ్, జి ల్లా మహిళా అధ్యక్షురాలిగా బద్రి సీతమ్మ, ఉ పాధ్యక్షుడిగా రాపాక చిన్నారావు, ప్రధాన కా ర్యదర్శిగా వంజరాపు కసవయ్య, గజ్జి షణ్ముఖరావు, మడ్డు వెంకటరావు, చిన్ని జోగారావు, లింగమూర్తి తదితరులను ఎన్నుకున్నారు.

ఈదురుగాలులతో తీరని నష్టం