ఇలా వెళ్లాలి... | - | Sakshi
Sakshi News home page

ఇలా వెళ్లాలి...

Oct 22 2025 6:49 AM | Updated on Oct 22 2025 6:49 AM

ఇలా వ

ఇలా వెళ్లాలి...

● నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం ● ఈ ఏడాది నాలుగు సోమవారాలు ఇలా వెళ్లాలి...

● నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం ● ఈ ఏడాది నాలుగు సోమవారాలు

ఆధ్యాత్మిక సౌరభం

శ్రీముఖలింగం

జలుమూరు: ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం దక్షిణ కాశీగా పేరొందింది. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం ముఖం దాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలింగమని, ఇక్కడ కొలువైన శివుడుని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. కాశీలో లింగం, గంగలో సాన్నం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ జరిగే కార్తీక సోమవారాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు దేశం నలుమూలలు నుంచి తండోపతండాలుగా వస్తారు. ఈ ఏడాది కార్తీక మాసం నాలుగు సోమవారాలుగా పడ్డాయి. ఈ క్షేత్రం కాశీకి తల్యమైనదిగా అభివర్ణిస్తున్నారు. కృతయుగంలో గోవిందేశ్వరుడు అనే నామంతో కనకాకృతిలోను, త్రేతాయగంలో మధుకేశ్వరుడనే నామంతో రజితాకృతిలోను, ద్వాపర యగంలో జయంతేశ్వరుడనే నామంతో కాంస్యాకృతిలోను, కలియుగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో ముఖం దాల్చి శిలాకృతిలో శివుడు శ్రీముఖలింగం క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు.

కోరిన కోర్కెలు తీరుతాయి

శ్రీముఖలింగంలో మూడు ప్రధాన ఆలయాలతో పాటు ఎన్నో శివలింగాలు ఉన్నాయి. కోటికి ఒక్కటి తక్కువగా ఉండడం వల్ల కాశీగా పేరొందాల్సిన శ్రీముఖలింగం దక్షిణ కాశీగా మిగిలి పోయిందని అర్చకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆలయ గర్భగుడిలో ఉన్న గోలెంను ముట్టుకొని మనస్సులో కోర్కెలు తల్చుకొని మొక్కితే ఆ న్యాయమైన కోర్కెలు తీరుతాయని శ్రీముఖలింగేశ్వర క్షేత్ర మహత్యంలో ఉంది. ప్రధాన ఆలయానికి తూర్పు దిక్కున ఉన్నది భీమేశ్వరాలయం కాగా.. దక్షిణ దిశలో ఉన్నది సోమేశ్వరాలయం. ఈ ఆలయాల్లో కూడా సాధారణ రోజలతోపాటు కార్తీక, శివరాత్రి పుణ్య దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే శ్రీముఖలింగేశ్వరునికి క్షేత్ర పాలకుడుగా విష్ణుమూర్తి వ్యవహరిస్తున్నట్లు చరిత్ర వివరిస్తోంది. కరకవలస గ్రామ సమీపాన రత్నగిరి కొండమీద కృష్ణార్జునులు ఉంటారు. అలాగే ఈ క్షేత్రాన్ని ఆశ్రయించి చాలా తీర్థాలు ఉన్నాయి. ఆలయం మొత్తం ఇండో –అర్బన్‌ శిల్ప కళతో ఎరుపు రాతితో చెక్కారు. అక్టోబర్‌ 22 నుంచి కార్తీక ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు.

శ్రీకాకుళం కాంప్లెక్స్‌ నుంచి శ్రీముఖలింగంనకు సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ క్షేత్రం చేరుకునేందుకు శ్రీకాకుళం నుంచి రెండు రూట్‌లు ఉన్నాయి. ఒకటి నరసన్నపేట నుంచి చల్లవానిపేట మీదుగా, మరొకటి కోమర్తి నుంచి ఉర్లాం మీదుగా శ్రీముఖలింగం చేరుకోవచ్చు.

బస్సు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి.

ఒకవేళ ట్రైన్‌లో వెళ్తే శ్రీకాకుళం

రోడ్డులో దిగాలి.

ఆలయం ఉదయం 5 గంటల నుంచి

సాయంత్రం 8 గంటల వరకు తెరిచి

ఉంటుంది.

ఇలా వెళ్లాలి... 1
1/2

ఇలా వెళ్లాలి...

ఇలా వెళ్లాలి... 2
2/2

ఇలా వెళ్లాలి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement