
పండ్ల ధరలు ౖపైపెకి..!
అమాంతం పెరిగిన పండ్ల ధరలు
కొనుగోలు చేయలేక సామాన్యుల
ఇబ్బందులు
పెరిగిన ధరలతో ఇబ్బందులు
మెళియాపుట్టి: ప్రస్తుతం మార్కెట్లో పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయ్యప్ప మాలధారణలు, ఈరోజు నుంచి కార్తీకం మొదలవ్వనుంది. ప్రతీరోజూ భక్తులు పండ్లు కొనుగోలు చేస్తారు. దీంతో ఇదే అదునుగా హోల్‌సేల్ వ్యాపారులు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా ఇటు ప్రజలు.. అటు సామాన్య భక్తులు, రోగులు కొనలేక, తినలేక అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పండ్ల ధరలు సామాన్యులకు దడపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్, జామ, డ్రాగన్, నారింజ, కమలా, ద్రాక్ష, అరటి, దానిమ్మ, కివీ రకాల పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. వీటిలో ఏది చూసుకున్నా కిలో రూ.150లు దాటి రూ.300 వందలకు పైచిలుకు ధర పలుకుతుండడంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. కాగా ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటల దిగుబడిపై ప్రభావం చూపాయి. దీంతోనే డిమాండ్ వలన అధిక ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అందువలన కొనుగోళ్లు మందగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన ధరలతో మేము కూడా అధిక ధరలకే పండ్లను కొనుగోలు చేస్తున్నాం. దీనివలన నిత్యం మా దగ్గర కొనుగోలు చేసేవారికి కూడా తగ్గించి అమ్మలేని పరిస్థితి నెలకొంది. తగ్గించి అమ్మితే నష్టపోతాం. అలాగని అమ్మకాలు మానేయలేం. ఎన్నో ఏళ్లుగా పండ్ల వ్యాపారం మీదే బతుకుతున్నాం. ధరలు తగ్గితే మా వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి.
– కె.సంజీవరావు,
పండ్ల వ్యాపారి, మెళియాపుట్టి

పండ్ల ధరలు ౖపైపెకి..!