
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం
● వైఎస్సార్‌సీపీ నాయకుల పిలుపు
మెళియాపుట్టి: కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామని మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. మండలంలోని కరజాడ, ముక్తాపురం, మురికింటిభద్ర తదితర గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని, దీనికి ప్రతీ కార్యకర్త నడుం బిగించాలని సూచించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ పల్లెలో చంద్రబాబు మోసాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో కరజాడ సర్పంచ్ బమ్మిడి పున్నయ్య, ముక్తాపురం సర్పంచ్ అలికాన జయప్రద, మర్రిపాడు.కె సర్పంచ్ పైల దివ్య, హరి, మాజీ ఎమ్మెల్యే చుక్క పగడాలమ్మ, మండల కన్వీనర్ పోలాకి జయమునిరావు, సీనియర్ నాయకులు ఉర్లాన బాలరాజు, బమ్మిడి ఖగేశ్వరరావు, బైపోతు ఉదయ్‌కుమార్, భాస్కర దాస్, అలికాన మాధవరావు, లింగాల సంజీవరావు, కరణం శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు