
హోటల్ రంగంతో ఉపాధి అవకాశాలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): హోటల్ రంగం ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్‌లోజిల్లా హోటల్స్, రెస్టారెంట్స్, బేకర్స్, ఫంక్షన్ హాల్స్ అసోసియేషన్, టౌన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం శనివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మెట్ట నాగరాజు నాయకత్వంలో ప్రధాన కార్యదర్శిగా కెల్ల కిశోర్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా అంధవరపు సతీష్, కోశాధికారిగా అంధవరపు తిరుమలరావు ప్రమాణస్వీకారం చేశారు.
టౌన్ అధ్యక్షుడిగా అరవల సతీష్, జనరల్ సెక్రటరీగా తుంబలి సుదర్శన్ పట్నాయక్, కోశాధికారిగా టంకాల కృష్ణ, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా ఏ.సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా సెంట్రల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వి.ఆనంద్, ఎస్.వి.డి మురళీ తదితరులు పాల్గొన్నారు.