
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
కవిటి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేయడం మరెవ్వరికీ సాధ్యం కావని కొత్తగా పార్టీలో చేరిన పలువురు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కవిటి మండలం కొత్తపుట్టుగలో ఎమ్మెల్సీ నర్తు రామారావు నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో టీడీపీ నుంచి పలువురు కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.
శావసానపుట్టుగకు చెందిన వీరికి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ, తమకున్న నమ్మకానికి భరోసా పెరిగి వైఎస్సార్‌సీపీలో చేరినట్టు వారు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యదర్శులు సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి, నర్తు నరేంద్రయాదవ్, పిలక రాజలక్ష్మి, ఉలాల భారతీదివ్య, కడియాల ప్రకాష్, ఇప్పిలి కృష్ణారావు, పూడి నేతాజీ, నర్తు ప్రేమ్‌కుమార్, నర్తు శివాజీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.