
ట్యాంకర్ షిప్‌లో పనిచేసేందుకు వెళ్తూ..
గార: ట్యాంకర్‌షిప్‌లో విధుల్లో చేరేందుకు వెళ్తూ బోటు బోల్తా పడిన ఘటనలో గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన మైలపిల్లి తారకేశ్వరరావు గల్లంతయ్యాడు. ఈ మేరకు షిప్పింగ్ సంస్థ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది. స్కార్పియో షిప్పింగ్ సంస్థ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. సంస్థలో ట్యాంకర్‌షిప్‌లో బూసన్ (సూపర్‌వైజర్)గా పనిచేస్తున్న తారకేశ్వరరావు ఈ నెల 12న స్వగ్రామం నుంచి బయలుదేరాడు. గురువారం మోజాంబికా సముద్రతీరంలో ఉన్న ట్యాంకర్ షిప్‌లో డ్యూటీ ఎక్కేందుకు గానూ 12 మంది బృందంతో కలసి లాంచ్ బోటులో ప్రయాణం చేస్తుండగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు సురక్షితంగా కాగా, ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన ఐదుగురిలో తారకేశ్వరరావు ఒకరు. దీంతో భార్య లక్ష్మీకాంతమ్మ, ఇద్దరు కుమారులు, కుటుంబసభ్యుల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
మత్స్యకార సామగ్రి దగ్ధం
రణస్థలం: కొవ్వాడ గ్రామంలో బడె మహందాతకు చెందిన కమ్మల షెడ్ శుక్రవారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్, బాధితుడు మహందాతకు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వాడ తీరంలోని సముద్రం ఒడ్డున తాటి, కొబ్బరి కమ్మలతో షెడ్ ఉంది. అందులో మత్స్యకారులకు చెందిన 12 పెద్ద వలలు, మర బోటు, ఇంజన్ బోటు, తాళ్లు ఉన్నాయి. ఈ షెడ్‌కు విద్యుత్ సరఫరా లేదు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు గ్రామస్తులు చూసేసరికి కమ్మల షెడ్ కాలిపోయి కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు షెడ్ కాల్చి వేసి ఉంటారని బాధితుడు అనుమానిస్తున్నాడు. సుమారు రూ.25 లక్షలు వరకు నష్టం చేకూరిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఘటనా స్థలాన్ని ఎఫ్‌డీవో గంగాధర్, జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి పరిశీలించారు.

ట్యాంకర్ షిప్‌లో పనిచేసేందుకు వెళ్తూ..