
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
పొందూరు: మండలంలోని పుల్లాజీపేట గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్‌తో జాడ ఉమామహేశ్వరరావు(38) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని జాడపేట గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు 13 ఏళ్ల క్రితం పుల్లాజీపేటకు చెందిన నాగమణిని వివాహం చేసుకుని, పుల్లాజీపేటలోనే ఎలక్ట్రీషియన్‌గా స్థిరపడ్డాడు. సోమవారం గ్రామంలో పి.సుబ్బారావు ఇంట్లో గ్రీజర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య నాగమణితో పాటు 6వ తరగతి చదువుతున్న కుమార్తె ప్రణన్య ఉంది. ఉమామహేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.