
‘సీబీఐతోనే దర్యాప్తు చేయించాలి’
నరసన్నపేట: కల్తీ మద్యం వ్యవహారంపై ప్రభు త్వం వేసిన సిట్ బృందం దర్యాప్తులో నిజాలు నిగ్గు తేలే పరిస్థితి లేదని, ప్రభుత్వం సీబీఐ తోనే దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మరోసారి డిమాండ్ చేశారు. కల్తీ మద్యం తీరు, కూటమి ప్రభుత్వం వ్యవహారంపై పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు విజయవంతం అయ్యాయన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు, సామాన్య ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారని ఇప్పటికై నా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని కోరారు. కల్తీ మద్యం వ్యవహారాన్ని వెనకేసుకు రాకుండా నిందితు లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లక్ష్మీపురంలో రచ్చ బండ కార్యక్రమంలో పాల్గొంటానని, కోటి సంతకాలు త్వరిత గతిన పూర్తి చేయాలని కార్యకర్తలను కోరారు.
‘ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల నుంచి మిల్లులకు తరలించేందుకు కొత్త వాహనాల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, ధా న్యం రవాణా చేసే ప్రతి వాహనానికి కచ్చి తంగా జీపీఎస్ పరికరం అమర్చుకోవాలని జా యింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. దీనికోసం ఆసక్తి ఉన్న వాహనదారులు ముందుగా రూ.3,068లు, (జీఎస్టీతో కలిపి) చెల్లించి, జీపీఎస్ అమర్చుకోవాలని ఆ తర్వాతే జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాల వద్ద తమ వాహన వివరాలను నమో దు చేసుకోవాలని సూచించారు. జీపీఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న వాహనాలకు మాత్రమే రవాణా ఖర్చులను ప్రభుత్వ నిబంధనల మేరకు చెల్లిస్తుందని, రవాణా కాంట్రాక్టు ఆశించే వాహనదారులు ఆలస్యం చేయకుండా, వెంటనే జీపీఎస్ అమర్చుకొని, ఆయా రైతు సేవ కేంద్రాలకు వెళ్లి వాహనాల వివరాలను తక్షణమే నమోదు చేసుకోవాలని జేసీ కోరారు.
కళింగపట్నం పీహెచ్‌సీ
ఆకస్మిక తనిఖీ
గార: కళింగపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్‌గౌర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం పీహెచ్‌సీకి వచ్చి స్టాఫ్ నర్సు డి.శాంతామణి నుంచి వివరాలు సేకరించారు. వైద్యులు సమ్మె చేయటం వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోర్టు కళింగపట్నంకు చెందిన కెప్టెన్ మైలపిల్లి జనార్ధన్ మాట్లాడుతూ తీర ప్రాంతంలోని మత్స్యకారులకు ఆరోగ్య ఉపకేంద్రాల్లో 24 గంటలు వైద్య సేవలందేలా చూడాలని కోరారు.
చేతికొచ్చిన 1010 రకం ధాన్యం
సారవకోట: మండలంలోని వెంకటాపురం, గొర్రిబంద, అడ్డపనస, అంగూరు, వడ్డినవలస తదితర గ్రామాల్లో సాగు చేసిన 1010 రకం ధాన్యం పంట చేతికొచ్చింది. సుమారు 100 ఎకరాల్లో మండలంలో ఈ రకం వరి సాగు చేయగా ప్రస్తుతం కోత యంత్రాలతో కోతలు చేపట్టి పచ్చి ధాన్యంను వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసి లారీలలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
‘పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోలు’
శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా పక్కా ప్రణాళికతో ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థంగా చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నతాధికారులు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఇచ్చిన సూచనలను వివరించారు.

‘సీబీఐతోనే దర్యాప్తు చేయించాలి’

‘సీబీఐతోనే దర్యాప్తు చేయించాలి’