
కోతల ప్రభుత్వం..
సీ్త్ర, శక్తి పథకంతో ఆటో, ట్యాక్సీ వాలాలు చాలాచోట్ల రోడ్డున పడ్డారు. ప్రయాణికులు దూరం కావడంతో పోషణ, ఫైనాన్స్, ఇతరత్రా ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రత్యామ్నాయం సాయం చేయలేదు. సంవత్సరానికి రూ. 15వేలు చొప్పున ఇస్తామన్న ఆటో డ్రైవర్ల సేవలో పథకం లబ్ధిదారుల్లో కూడా కోత పెట్టింది. సాధారణంగా ప్రతి ఏటా ఏ పథకమైనా లబ్ధిదారులు పెరుగుతారు. ఉద్యోగ, ఉపాఽధి అవకాశాలు దొరకక ఆటోవాలాలైతే మరింత పెరు గుతున్నారు. ఈ లెక్కన గత ప్రభుత్వంలో వాహన మిత్ర కింద ఇచ్చిన లబ్ధిదారుల కన్న సంఖ్య ఎక్కువగా ఉండాలి. కూటమి ప్రభుత్వంలో మాత్రం ఆటో వాలాల లబ్ధిదారులను తగ్గించేశారు. గత ప్రభుత్వంలో 14,320మందికి వాహన మిత్రం పథకం కింద సాయం అందజేయగా, ఈ ప్రభుత్వం 13,886 మందిని మాత్రమే లబ్ధిదారులగా ఎంపిక చేసింది. వీరిలో ఎంతమందిక జమవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే ఒక సంవత్సరం ఎగ్గొట్టడంతో ప్రతీ ఒక్కరూ రూ.15వేలు కోల్పోయారు. ఇప్పుడు ఆంక్షల పేరుతో సుమారు 500 మందిని తీసేశారు. ఇక, కొత్తగా ఆటో, ట్యాక్సీలు తీసుకున్న వారు వేలల్లో ఉన్నారు. ఈ లెక్కన సంఖ్య మరింత పెరగాలి. కానీ, ఏదో రకంగా తప్పించుకోవాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో కూడా దగా చేసింది.