
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
నరసన్నపేట : జాతీయ రహదారిపై కోమర్తి పెట్రోల్ బంకు వద్ద గురువారం ఆగి ఉన్న ఆటోను వెనుక వస్తు న్న మరో ఆటో అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక ఆటోలో ఉన్న అంపోలు గ్రామానికి చెందిన ధర్మాన సంధ్య, దంత జయశ్రీ, దంత కనకమహలక్ష్మి, జమ్ము రాజేశ్వరమ్మలకు గాయాలయ్యాయి. వీరంతా పోలాకి మండలం గొల్లవలస వెళ్లేందుకు మునసబుపేటలోని గాయత్రీ కళాశాల వద్ద ఆటో ఎక్కారు. దేవాది దాటిన తర్వాత పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి ముందున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు.