
మహనీయుల త్యాగాలు వెలకట్టలేనివి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీతో పాటు ఎంతో మంది మహానుభావులు చేసిన త్యాగాల వల్లే నేడు స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్నారని, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై నా ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నా రు. మహాత్మాగాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కలెక్టరేట్ పరిపాలనాధి కారి జి.ఎ.సూర్యనారాయణ, పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, సెక్షన్ పర్యవేక్షకులు డి.రామమూర్తి, సురేష్, మీడియా ప్రతినిధి శాసపు జోగి నాయుడు పాల్గొన్నారు.