దందా..! | - | Sakshi
Sakshi News home page

దందా..!

Sep 16 2025 8:46 AM | Updated on Sep 16 2025 8:46 AM

దందా.

దందా..!

ఫిట్నెస్‌ పేరుతో

శ్రీకాకుళం రూరల్‌: నగర పరిధిలోని కిమ్స్‌ రహదారి, జిల్లా వ్యవసాయ కార్యాలయానికి అనుసరించి ఇటీవల ఏర్పాటు చేసిన ఆర్టీఏ కార్యాలయానికి అనుబంధంగా నడుస్తున్న ఫిట్నెస్‌ సెంటర్‌ (గవర్నమెంట్‌ అప్రువుడ్‌ ఆటోమేటిడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌)లో అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రతీ వాహనానికి ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ కావాలనే ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కి ఆయా వాహనాలకు కమీషన్లు తీసుకుంటూ సర్టిఫికెట్లు అందిస్తున్నారు.

ముక్కుపిండి వసూళ్లు

జిల్లాలోని ట్రాన్స్‌పోర్టు, నాన్‌ ట్రాన్‌పోర్టు వాహనాలకు సంబంధించి ఇక్కడ నుంచే ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం కారు, బస్సు, ఆటో, లారీ ఏ వాహనమైనా ప్రభుత్వానికి కట్టాల్సిన చలానా కేవలం రూ.1,000 నుంచి రూ.2,000ల లోపు ఉంటుంది. కానీ ఇక్కడ ఏజెంట్లకు మాత్రం ఆయా వాహనాలకు సుమారు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు కమీషన్‌ ముట్టజెప్తేనే లోపలికి అనుమతి ఇస్తారు. లేదంటే వాటిని గేటు నుంచి వెనక్కి పంపేస్తారు. పొరపాటున ఎవరైనా రికమెండేషన్‌ ద్వారా కేవలం ప్రభుత్వ చలానా మాత్రమే తీసి టెస్టింగ్‌కు పంపిస్తే మాత్రం, లేనిపోని కారణాలు చెప్పి ఫిట్నెస్‌ ఫెయిల్‌ చేసిన సందర్భాలు కూడా కోకొల్లలు.

గంటల కొద్దీ నిరీక్షణ

కొన్నేళ్ల క్రితం వరకు ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ కావాలంటే క్షణాల్లోనే ఇచ్చేవారు. ఆయా వాహనాలకు సంబంధించిన కాగితాలు చూసి ఆర్టీఏ సిబ్బంది వాహనాన్ని డ్రైవింగ్‌ చేసి పంపేవారు. కానీ ప్రస్తుతం ఫిట్నెస్‌ కేంద్రంలో ఏదైనా వాహనం లోపలికి వెళ్తే మాత్రం గంటల కొద్దీ నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఉదయం వెళ్లిన బండ్లు సాయంత్రానికే తిరిగి వస్తాయి. దీంతో సహనం కోల్పోతున్న వాహన డ్రైవర్లు ఫిట్నెస్‌ కేంద్ర సిబ్బందితో వాగ్వివాదం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అంతా ఏజెంట్ల సమక్షంలోనే...

గత ప్రభుత్వంలో ఆర్టీఏ పనులు వాహన్‌ యాప్‌లో, స్థానిక సచివాలయంలోనూ త్వరితగతిన జరిగేవి. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఏజెంట్లతోనే అంతా కమీషన్‌ పద్ధతిలో ఫిట్నెస్‌ కేంద్రంలో జరగడం గమనార్హం. ప్రతీ ఫైల్‌కు ఒక్కో రేటు పెట్టి ఆ రేటును ఏజెంట్లకు ముట్టజెప్పితేనే బండికి ఫిట్నెస్‌ అందిస్తారు. ఇంత వ్యవహారం జరుగుతున్నా నియంత్రించాల్సిన ఆర్టీఏ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తనట్లు ఉంటున్నారని వాహన డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కమీషన్‌ ఇస్తేనే సర్టిఫికెట్‌ మంజూరు

ఒక్కో వాహనానికి ఒక్కో రేటు ఫిక్స్‌

అంతా ఏజెంట్లుతోనే నడుస్తున్న వైనం

పట్టించుకోని ఆర్టీఏ అధికారులు

అదనంగా రూ.3 వేలు

నేను ఎస్పీ కార్పొరేషన్‌ ద్వారా కారు లోను తీసుకున్నాను. నాది టాక్సీబోర్డు. రెండు రోజులు క్రితం ఫిట్నెస్‌ చేయించాను. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చలానా రూ.1,000లు తీశారు. కానీ ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేయడానికి అదనంగా మరో రూ.3 వేలు కేంద్రంలోని సిబ్బందికి ముట్టజెప్పాల్సి వచ్చింది.

– టి.శ్రీనివాసరావు, పొందూరు

మా చేతిలో ఏమీ లేదు

ఒకప్పుడు వాహనానికి ఫిట్నెస్‌లు మా ఆర్టీఏ పరిధిలో ఉండేవి. ఇప్పుడు అంతా ప్రైవేటుపరం అయ్యింది. దీంతో మా చేతిలో ఏమీ ఉండడం లేదు. వాహన ఫిట్నెస్‌కు సంబంధించి చాలా మంది డ్రైవర్లు, వాహన యజమానుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని చేరవేశాం. – ఎ.విజయసారథి,

ఉప రవాణా శాఖాధికారి, శ్రీకాకుళం

దందా..! 1
1/3

దందా..!

దందా..! 2
2/3

దందా..!

దందా..! 3
3/3

దందా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement