
బాల్య వివాహాలు నేరం
శ్రీకాకుళం అర్బన్: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి ఐ.విమల అన్నారు. శుక్రవారం నగరంలోని గూనపాలెంలో శాంతినికేతన్ కళాశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాలికలకు చిన్నతనంలోనే వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికై నా బాల్యవివాహాలు జరిగితే 1098కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.అప్పలరాజు, వార్డు ఇన్‌చార్జి కొర్ను నాగార్జున ప్రతాప్, సీడీపీఓ నాగరాణి, సూపర్‌వైజర్లు బి.యోగేశ్వరి, యశోద, పి.సీతామహాలక్ష్మి, కళ్యాణి పాల్గొన్నారు.