
నల్లబ్యాడ్జీలతో ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన
నరసన్నపేట: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ప్రకారం అర్హత కలిగిన ఉద్యోగులు, డీఎస్సీ –2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డీఎస్సీ–2003 ఫోరం జిల్లా కో కన్వీనర్ అంబటి లక్ష్మణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పాత తాలూకా కేంద్రం నరసన్నపేటలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాడాన రాజు, టి.జనార్దనరావు, రమణ, చిరంజీవి, వాసు, ఉమాశంకర్, సురేష్‌కుమార్, రజిని, రమేష్, లక్ష్మి, శాంతి, కమలకుమారి, రోజామణి,రామారావు, తవుడు, వాసుదేవరావు, తాతన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.