శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా కమిటీని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉపాధ్యక్షులుగా సతివాడ రామినాయుడు(నరసన్నపేట), జడ్యాడ జయరామ్(టెక్కలి), ప్రధాన కార్యదర్శులుగా నీలాపు ముకుందరావు(శ్రీకాకుళం), మురమండల ఉమాశంకర్(ఆమదాలవలస), బలగ గోవిందరావు(పాతపట్నం), మీసాల సురేష్‌బాబు(పలాస), నూతనపాటి బాబూరావు(ఇచ్ఛాపురం), కార్యదర్శులుగా కోటిపల్లి శ్రీనివాసరావు(నరసన్నపేట), గొండీల సుజాతకుమారి(టెక్కలి), కుందేశీ ప్రియ(ఇచ్ఛాపురం), కంఠ గోవిందరావు(ఆమదాలవలస), కలగాటి జాన్(ఆమదాలవలస), పంకు మోహనరావు(పాతపట్నం), బెలమాన జీవన్‌రావు(పలాస), వడ్డి జీవకుమార్(ఎచ్చెర్ల), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ముచ్చ జగన్(శ్రీకాకుళం), కుర్మాన జోషఫ్ (శ్రీకాకుళం), ఉంకిలి గోపాలకృష్ణ(నరసన్నపేట), అరమపల్లి రాము(నరసన్నపేట), కూరాకుల సుబ్బారావు(టెక్కలి), చల్ల అప్పలరాజు(టెక్కలి), ముద్దాడ ఈశ్వరరావు(ఆమదాలవలస), రావాడ వెంకటరావు(ఆమదాలవలస), గుడిబండ పోలయ్య(పాతపట్నం), రావాడ లక్ష్మీనారాయణ(పాతపట్నం), యలమల కృష్ణ(ఎచ్చెర్ల), లింగాల లక్ష్మణరావు(ఎచ్చెర్ల), జడ్యాడ దేవానంద(పలాస), పంకు దుర్యోధన(పలాస), లండ కృష్ణారావు(ఇచ్ఛాపురం), కొప్పల హేమంత్‌కుమార్(ఇచ్ఛాపురం)లను నియమించారు.
హెల్త్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం
ఎచ్చెర్ల : బొల్లినేని మెడ్ స్కిల్స్ (జెమ్స్ రాగోలు)తో సంయుక్తంగా నిర్వహిస్తున్న హెల్త్ సంబంధిత కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ బి.ఆర్.ఏ.యూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అనూరాధ గురువారం తెలిపారు. మాస్టర్ ఆఫ్ హెల్త్‌కేర్ అడ్మినిస్ట్రేటివ్ (రెండేళ్లు, 40సీట్లు), పీజీ డిప్లోమా ఇన్ మెడికల్ రికార్డ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్(ఏడాది–40సీట్లు) కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (జనరల్), బీఫార్మశీ, బీఎస్సీ (నర్సింగ్), బీహెచ్‌ఎంఎస్ లేదా బీఏఎంఎస్, బీఏ, బీకాం కోర్సులు పూర్తిచేసిన 20 నుంచి 35 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వాల్తేరు ఏడీఆర్‌ఎంగా రామారావు
సోంపేట: ఎర్రముక్కాం గ్రామానికి చెందిన కుందు రామారావు వాల్తేరు డివిజన్ ఏడీఆర్‌ఎంగా పదోన్నతి పొందారు. ఈయన ప్రస్తుతం గుంటూరు విజయవాడ దక్షిణ మధ్యరైల్వేలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏడీఆర్‌ఎంగా పదోన్నతి పొందడంతో గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రైల్వేస్టేషన్ల ఆధునీకరణలో భాగస్వామ్యం అయ్యానని, రైల్వేబోర్డు తరఫున బుల్లెట్ ప్రూఫ్ రైల్ అధ్యయనం కోసం జపాన్ సైతం వెళ్లానని చెప్పారు.
అప్పారావు నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని గుడివీధిలో నివాసముంటున్న అంధవరపు అప్పారావు (93) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన మరణానంతరం నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు ఎ.రామరాజు, నాగేశ్వరరావులు నేత్రాలను దానం చేసేందుకు ముందుకువచ్చారు. విషయం కె.సత్యనారాయణ ద్వారా రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేయగా, నేత్ర సేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్‌చార్జి సుజాత, నంది ఉమాశంకర్‌లు చేరుకుని అప్పారావు కార్నియాలను సేకరించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు సంప్రదించాలని రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, సభ్యులు దుర్గాశ్రీనివాస్ కోరారు.