
ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి
శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : పెరిగిన ఎస్సీ జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాల, రెల్లి, అనుబంధ కులాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నందున ప్రభుత్వాలు పునారాలోచన చేయాలని కోరారు. క్రిమిలేయర్ రద్దు చేయాలని, ప్రైవేటు రంగాల్లోనూ ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తింపజేయాలన్నారు. ఈ మేరకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, ఎస్సీ, ఎస్టీ దళిత సంఘాల జేఏసీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్కు వ్యతిరేకంగా శ్రీకాకుళం నగరంలో పాదయాత్ర చేపట్టారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పేరుతో చేపట్టిన ఈ పాదయాత్ర శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకూ కొనసాగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు తొల్లిబిల్లి అశోక్బాబు, డాక్టర్ చెన్నకేశవులు తదితరులు అంబేడ్కర్ జంక్షన్ వద్ద రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల అర్పించారు. కార్యక్రమంలో అంబేడ్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను, జిల్లా దళిత సంఘాల జేఏసీ నేతలు కళ్లేపల్లి రామ్‌గోపాల్, బడియా కామరాజు, కంఠ వేణు, ముంజేటి కృష్ణ, యజ్జల గురుమూర్తి, పొన్నాడ రుషి, దళిత ఉద్యోగుల సంఘ నేతలు ఆర్.వేణుగోపాల్, బోనెల రమేష్ , చల్లా రామారావు, న్యాయవాదులు మురళీకృష్ణ, జె.శ్రీనివాసరావు, పురుషోత్తం రాంబాబు, యడ్ల జానకి, నేతల అప్పారావు, సుంకు రమణ, పెయ్యల చంటి, అరుబారిక రాజు, లక్ష్మణ, రాము, సూర్యనారాయణ, బుడుమూరు రామారావు, పంకు మహేష్, పంకు మురళీ, అబ్బాస్, శంకర్ , భాస్కరరావు, లింగాల మల్లేశరి, శీర రాజేశ్వరి, హారతి పాల్గొన్నారు.