
రాష్ట్రంలో దుర్మార్గ పాలన
ప్రజల హక్కులను కాపాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సాక్షి దినపత్రిక ద్వారా ప్రజలకు వివరిస్తుండటాన్ని అధికార పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. దీనిలో భాగంగానే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రజలే కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు.
– సింగుపురం మోహన్‌రావు, న్యాయవాది