
గోతిలో దిగబడిన టిప్పర్
● వాహనాల రాకపోకలకు అంతరాయం
మెళియాపుట్టి: మెళియాపుట్టి నుంచి పాతపట్నం వెళ్లే ఆల్ ఆంధ్రా రహదారిలో రోడ్డుకి అడ్డంగా టిప్పర్ లారీ దిగబడిపోయింది. పాతపట్నం నుంచి మెళియాపుట్టి వైపు ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ సుందరాడ వచ్చేసరికి, ఇటీవల కురిసిన వర్షాలకు జలజీవన్ మిషన్ పైప్‌లైన్ల కోసం తవ్విన గోతుల్లో నీరుచేరడంతో చక్రాలు దిగిపోయి కూరుకుపోయింది. దీంతో రాత్రి 7 గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు జేసీబీలు లారీని బయటికి తీయడానికి విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. మరలా ఇసుకంతా వేరే వాహనానికి తరలించి లారీని బయటకు తీశారు. అనంతరం వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు.