
బీఆర్‌ఏయూ రిజిస్ట్రార్‌గా అడ్డయ్య
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా వర్సిటీ సీనియర్ అధ్యాపకుడు ఆచార్య బి.అడ్డయ్య నియమితులయ్యారు. ఈ మేరకు వర్సిటీ వీసీ ఆచార్య కె.ఆర్.రజని నియామక ఉత్తర్వులు బుధవారం అందజేశారు. ఇప్పటివరకు అడ్డయ్య వర్సిటీ రెక్టార్‌గా వ్యవహరించడమే కాకుండా, పలుమార్లు ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా సేవలను అందించారు.
గ్యాస్ సిలిండర్ నుంచి
మంటలు
నరసన్నపేట: స్థానిక మెయిన్ రోడ్డులోని వేంకటేశ్వర థియేటర్ సమీపంలో ఉన్నటువంటి ఎం.పాపారావు ఇంట్లో పెను ప్రమాదం తప్పింది. ఉదయం పాపారావు భార్య కుమారి పాలు మరిగిస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. కొన్ని సెకన్లలోనే మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కుమారి భయంతో బయటకు పరుగులు తీసింది. వెంటనే స్థానికులు వచ్చి తడి గోనె సంచులు కప్పి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి, పరిశీలించి తగు సూచనలు చేశారు. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు.
నార్త్‌జోన్ క్రికెట్ టోర్నీలో శ్రీకాకుళం బోణీ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏసీఏ నార్త్‌జోన్ అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీలో శ్రీకాకుళం జట్టు విజయంతో బోణీ కొట్టింది. జిల్లా బ్యాటర్ అబ్దుల్ సమీర్ 112 పరుగుల అజేయ సెంచరీతో, రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్ డీవీ శ్రీరామ్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 10 వికెట్లతో విజృంభించడంతో ఆతిథ్య విజయనగరంతో సోమవారం నుంచి బుధవారం వరకు జరిగిన మల్టీడేస్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శ్రీకాకుళం ఘన విజయం సాధించింది. విజయనగరం జిల్లా వేదికగా ఏసీఏ నార్త్‌జోన్ అంతర్ జిల్లాల త్రీడేస్ (మల్టీడేస్) పురుషుల అండర్–23 క్రికెట్ టోర్నమెంట్ ఇటీవలే మొదలైంది. టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య విజయనగరం, శ్రీకాకుళం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీకాకుళం జట్టు 148 పరుగుల వద్ద కుప్పకూలింది. 101 పరుగుల ఆధిక్యంతో తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విజయనగరం జట్టు 164 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 266 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీకాకుళం జట్టు ధాటిగా బ్యాటింగ్‌చేసి 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. తదుపరి తూర్పుగోదావరితో మ్యాచ్ జరగనుంది.

బీఆర్‌ఏయూ రిజిస్ట్రార్‌గా అడ్డయ్య

బీఆర్‌ఏయూ రిజిస్ట్రార్‌గా అడ్డయ్య

బీఆర్‌ఏయూ రిజిస్ట్రార్‌గా అడ్డయ్య

బీఆర్‌ఏయూ రిజిస్ట్రార్‌గా అడ్డయ్య