
ఏపీపేట గ్రామ రైతు సేవా కేంద్రం
బూర్జ మండలంలోని బూర్జ, గుత్తావల్లి, పాలవలస, ఏపీపేట గ్రామ రైతు సేవా కేంద్రాల ఆవరణలో ఎరువుల టోకెన్లు కోసం రైతులు గంటలు కొద్ది నిరీక్షిస్తున్నారు. బుధవారం రైతులకు టోకెన్లు అందజేసి గురువారం ఎరువుల అందజేస్తారనే సమాచారంతో రైతులు క్యూలో నిల్చొని టోకెన్లు అందుకున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయశాఖ ఏవో డి.ఉషారాణి మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం అధైర్యపడవద్దని సూచించారు. అందరికీ విడతల వారీగా ఎరువులు అందజేస్తామన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
– బూర్జ