
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం
టెక్కలి : వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎన్ని ధనుంజయరావు, టెక్కలి నియోజకవర్గానికి చెందిన కెల్లి జగన్నాయకులు, ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన గుమ్మడి రాంబాబులను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమించారు.
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లాకు చెందిన పలువురు నాయకులను నియమిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జన్ని అనిరుద్రుడు(ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ), బందపల్లి రాకేష్(ఎస్టీ సెల్ కార్యదర్శి), హరిబంద్ జన్నీ (నిత్యానంద)(ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ), కొనపల సురేష్(చేనేత విభాగం సెక్రటరీ), కాలేపు శ్రీదేవి(చేనేత విభాగం జాయింట్ సెక్రటరీ), పచ్చిగుళ్ల సాయిరాం(వాణిజ్య విభాగం జాయింట్ సెక్రటరీ), కిల్లి అజయ్‌కుమార్(ఐటీ విభాగం కార్యదర్శి), అదపాక ఉమాశంకర్(ఐటీ విభాగం జాయింట్ సెక్రటరీ), బంకుపల్లి లోకనాధం శర్మ(ప్రచార విభాగం కార్యదర్శి), తమ్మినేని మురళి(ప్రచార విభాగం కార్యదర్శి), కెళ్ల రామకృష్ణ(ప్రచార విభాగం జాయింట్ సెక్రటరీ), బెండి గాంధీ(ప్రచార విభాగం జాయింట్ సెక్రటరీ), గెళ్లంకి వెంకట్రావు(గ్రీవెన్స్ విభాగం జాయింట్ సెక్రటరీ), నూక సత్యరాజ్(పంచాయతీరాజ్ విభాగం ఉపాధ్యక్షుడు), గురుబెల్లి శ్రీనివాసరావు(పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీ), పూడి నీలాచలం(పంచాయతీరాజ్ విభాగం జాయింట్ సెక్రటరీ), వావిలాపల్లి మురళి(పంచాయతీరాజ్ విభాగం జాయింట్ సెక్రటరీ)లను నియమించారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం