
ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టి కృషితో ముందుకు సాగాలని జగన్‌మోహన్‌రెడ్డి సూచించినట్లు రవికుమార్ పేర్కొన్నారు.
– ఆమదాలవలస
28 పశువులు పట్టివేత
రణస్థలం: లావేరు మండలంలోని ఎన్‌హెచ్–16పై సుభద్రాపురం జంక్షన్‌లో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వెళ్తున్న రెండు ఐసర్ వ్యాన్‌లలో తరలిస్తున్న 28 పశువులను(గేదెలను) లావేరు పోలీసులు పట్టుకున్నారు. దీనిపై లావేరు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇద్దరిపై కేసు నమోదు
కొత్తూరు : నివగాం గ్రామానికి చెందిన బి.కమలహాసన్, బి.రాజేష్‌లు వెలుగు కార్యాలయంలోకి వచ్చి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించారని ఏపీఎం లలిత పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎండీ అమీర్ ఆలీ బుధవారం తెలిపారు.