
ఏఎన్‌ఎం బదిలీల అక్రమాల్లో పాత్రధారులపై చర్యలు
అరసవల్లి: సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంల బదిలీల అక్రమాలు జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే ఈ బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందని, నిబంధనలన్నీ తోసిపు చ్చి వైద్యశాఖాధికారుల కనుసన్నల్లో బదిలీ స్థానాలను కేటాయించారంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో వరుసగా చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే ఇదే అక్రమ వ్యవహారంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయ సూపరింటెండెంట్ డి.భాస్కర్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ వైద్య శాఖ రీజనల్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. దీంతో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ కె.అనిత కూడా బాధ్యుల ను గుర్తించి ఇద్దరికి తాజాగా మెమోలను జారీ చేశారు. అయితే ఇందులో సంబంధిత ఎస్టాబ్లిష్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ భవాని ప్రసాద్‌తో పాటు సూపరింటెండెంట్ భాస్కర్‌కుమార్‌కు కూడా మెమోలను జారీ చేశారు. అయితే ఇందులో ప్రోసీజర్ ఫాలో అవ్వకుండా ఆలస్యంగా మెమోలను జారీ చేసి చేతులు దులుపుకున్నారంటూ డీఎంహెచ్‌ఓ అనితపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.
విమర్శల వెల్లువ
ఇటీవల జిల్లాలో మొత్తం 605 మందిలో 584 మంది ఏఎన్‌ఎంలకు బదిలీలు జారీ చేశారు. అయితే నిబంధనల ప్రకారం కాకుండా జూమ్ వీడియో మీటింగ్ ద్వారా బదిలీల ప్రక్రియను చేపట్టడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి విదితమే. అలాగే బదిలీల ఖాళీలను ఉన్నతాధికారి ఆమోదంతోనే ముందుగానే బ్లాక్ చేశారనే విమర్శలున్నాయి. అయితే దీనిపై అప్ప ట్లో ఏఎన్‌ఎంలంతా అర్ధరాత్రి వరకు కార్యాలయంలోనే బైటాయించి నిలదీయడంతో ఖాళీల న్నీ రిలీజ్ చేసి బదిలీలను చేసిన సంగతి విదితమే. అయితే అప్పటికే ఎవరికి కావాల్సిన స్థానాల్లో వారిని బదిలీలు చేసి రూ.లక్షల్లో వెనుకేసుకున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై కూ డా జిల్లా కలెక్టర్‌తో పాటు సీఎంఓకు కూడా ఫిర్యాదులు వెళ్లడంతో ఈ అక్రమాలపై చర్యలు వేగవంతం కానున్నాయి.
ఇప్పటికే ఈ బదిలీల అక్రమాల వ్యవహారంలో షోకాజ్ అందుకుని సస్పెన్షన్‌లో ఉన్న సూపరింటెండెంట్ భాస్కర్‌కుమార్‌కు ఇప్పుడు తాజాగా సోమవారం మెమో జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సస్పెన్షన్ వేటుకు ముందే ఈ మెమోను ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఓ కీలక అధికారి తనదైన శైలిలో వ్యవహారంలో తన చేతికి మట్టి అంటకూడదన్నట్టుగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంలో ఒక్క భాస్కర్‌కుమార్‌నే బలి చేశారన్న చర్చ మొదలైంది.
తాజాగా ఇద్దరికి మెమోలు జారీ
ఇప్పటికే సూపరింటెండెంట్‌ను
సస్పెండ్ చేసిన రీజనల్ డైరక్టర్