
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు సుప్రజ
నరసన్నపేట: తాడేపల్లిగూడెంలో ఈ నెల 21న జరగనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు నరసన్నపేట శ్రీరామ్‌నగర్‌కు చెందిన వండాన సుప్రజ ఎంపికయ్యారు. నరసన్నపేటలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో సుప్రజ ట్రెడిషనల్ యోగా, సుపైన్ యోగా విభాగాల్లో మొదటి స్థానం సాధించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ఎంపిక చేసినట్లు నేషనల్ యోగా స్పోర్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు సమాచారం ఇచ్చారని యోగా గురువు సదాశివుని రవి మంగళవారం తెలిపారు.
వజ్రోత్సవాలకు ప్రత్యేక సంచిక
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షణలో వజ్రోత్సవాల ప్రత్యేక సంచిక విడుదల చేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు సంచికలో ప్రచురించాల్సిన వ్యాసాలపై మంగళవారం జిల్లా ప్రముఖులతో సమీక్షించారు. అనంతరం కొన్ని ఆర్టికల్స్‌ను ఎంపిక చేసి కలెక్టర్‌తో పాటు అస్టిసెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్‌లకు వివరించారు. కార్యక్రమంలో ఇంటాక్ కన్వీనర్ సన్యాసిరావు, కో కన్వీనర్ నటుకుల మోహన్, అదనపు కన్వీనర్ వి.జగన్నాథంనాయుడు, సంచిక కమిటీ సభ్యులు ఎల్.రామలింగస్వామి, ఎస్.జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఏటీఎం చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్టు
సోంపేట: సోంపేటతో పాటు జిల్లాలో పలు పోలీసుస్టేషన్ల పరిధిలో ఏటీఏంల వద్ద ప్రజలను మభ్యపెట్టి నగదు తస్కరించిన ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. సోంపేట సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ బి.మంగరాజుతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 5న ఉదయం సోంపేట ఎస్‌ఐ వి.లోవరాజు, కంచిలి ఎస్‌ఐ పారినాయుడు సోంపేట బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒడిశా రాష్ట్రానికి చెందిన డి.హరిహర రెడ్డి, సింహాచలం సాహు, బురిడి అశోక్ పాత్రో అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పట్టుకుని విచారించగా జిల్లాలోని పలు ఏటీఎంల వద్ద ఏటీఎం కార్డులు మార్చి దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వీరు రూ.17,21,240 చోరీ చేయగా.. అందులో రూ.5,60,000 రికవరీ చేసుకున్నారు. ముగ్గురినీ అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
ఎస్పీని కలిసిన ఏఆర్ ఆర్‌ఐ
ఎచ్చెర్ల : మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి సాధారణ బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం ఆర్ముడ్ రిజర్వ్ విభాగానికి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ)గా బదిలీపై వచ్చిన ఎన్.శంకర్‌ప్రసాద్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను బహూకరించిన అనంతరం స్థానిక పరిస్థితులపై కాసేపు చర్చించారు.
జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల జాబితా ఖరారు
శ్రీకాకుళం న్యూకాలనీ: సౌత్‌జోన్ నేషనల్స్ మీట్‌కు ముందు జరిగే ఏపీ జూనియర్స్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల జాబితా ఖరారైంది. ఎంపికై న 80 మందికిపైగా అథ్లెట్స్ వివరాలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు బాపట్ల జిల్లా చీరాల వేదికగా స్టేట్‌మీట్ జరగనుంది. ఈ పోటీల్లో అండర్–14, 16, 18, 20 నాలుగు వయో విభాగాల్లో పోటీలు జరగనున్నందున క్రీడాకారుల ఎంపికలను ఇటీవల శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంపికై న క్రీడాకారులంతా ఈ నెల 7న రాత్రి 8 గంటలకు శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ వద్దకు తమ లగేజీతోపాటు జనన ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు, 2 పాస్‌ఫొటోలతో చేరుకుని సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి కె.మాధవరావు (9441570361)ను సంప్రదించాలని మధుసూదన్, సాంబమూర్తి పేర్కొన్నారు. జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల బృందానికి కోచ్ మేనేజర్లగా అథ్లెటిక్స్ కోచ్ కె.రామారావు, పీఈటీ ఇ.అప్పన్న వ్యవహరించనున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలకు 8500271575 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు సుప్రజ

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు సుప్రజ