
జాతీయ పథకాలపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ స్థాయి మానిటరింగ్ (ఎన్‌ఎల్‌ఎం) బృందం జిల్లాలో అమలవుతున్న జాతీయ పథకాలపై సోమవారం సమీక్ష నిర్వహించింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షకు బృంద సభ్యులు సునీల్ బంటా, నాథు సింగ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో పారదర్శకత, సమగ్రత అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ, పీఎం గ్రామ సడక్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన తదితర పథకాల అమలు స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ప్రజల వద్దకు పథకాల లబ్ధి పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ బృందం జిల్లాలో ఐదు రోజులు పలు గ్రామాల్లో పర్యటిస్తుందని డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ తెలిపారు.