‘పచ్చి రొట్ట ఎరువుతో మట్టికి జీవం’ | - | Sakshi
Sakshi News home page

‘పచ్చి రొట్ట ఎరువుతో మట్టికి జీవం’

Jul 22 2025 6:36 AM | Updated on Jul 22 2025 9:07 AM

‘పచ్చ

‘పచ్చి రొట్ట ఎరువుతో మట్టికి జీవం’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పచ్చి రొట్ట ఎరువుతో మట్టికి జీవం అందుతుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో పచ్చి రొట్ట ఎరువులకు సంబంధించి వాల్‌ పోస్టర్‌ను కలెక్టర్‌తో పాటు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మా న్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట పైర్లను వాడటం ద్వారా 25 శాతం ఎరు వు ఆదా అవుతుందని పేర్కొన్నారు. జీవన ఎరువుల కాలపరిమితి 36–12 నెలలని, గడు వు మించని ఎరువులు వాడాలన్నారు. రసాయనిక ఎరువులు, కీటక నాశకాలతో కలిపి వేయకూడదని వివరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌, డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి త్రినాథ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

బొచ్చె.. చేతిలోకి వచ్చె..

మెళియాపుట్టి మండలం మాకనాపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో 10 కిలోల చేప వలకు చిక్కింది. సోమవారం చెరువులో చేపల వేట చేయడంతో ఈ చేప చిక్కినట్లు పెద్దపద్మాపురం గ్రామానికి చెందిన మాణిక్యం తెలిపారు. చాలాకాలంగా వలకు దొరక్కపోవడంతో ఇంత బరువు పెరిగిందని, దీన్ని బొచ్చె చేప అంటారని పేర్కొన్నారు.

– మెళియాపుటి్ట

ప్రభుత్వ పాఠశాలలో కుమార్తెను చేర్పించిన హెచ్‌ఎం

మందస: మందస మండలం భిన్నళి మదనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.దివ్య ఆదర్శంగా నిలిచారు. ఆమె ఇటీవలే బదిలీపై ఈ పాఠశాలకు వచ్చా రు. కానీ ఇక్కడ కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఆమె తన కుమార్తె చాతు ర్యను రెండో తరగతిలో చేర్పించారు. దీంతో మరో నలుగురు కూడా బడిలో చేరారు. ఈ సందర్భంగా మందస ఎంఈఓ–2 సుందర్‌ సోలమన్‌ సోమవారం పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయురాలిని అభినందించారు.

శ్రీముఖలింగంలో శివ స్వాములు

జలుమూరు: ఆషాఢ మాసం ఆఖరి సోమ వారం ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో శివస్వాములు మధుకేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి 42 రోజుల దీక్ష అనంతరం స్వామికి ఏకవార అభిషేకాలు, అర్చనలు అనంతరం వారాహి అమ్మవారికి మొక్కులు చెల్లించి కుంకుమ పూజలు నిర్వహించారు. శివ స్వాములు తేనె, పానకాలు, ఇరుముడులు స్వామికి సమర్పించి గోలెం మొక్కులు తీర్చా రు. ఏటా స్వామికి దీక్షతో మొక్కులు తీర్చి ఇరుముడి సమర్పించుకుంటామని రాయగడకు చెందిన గురుస్వామి జితేంద్ర స్వామి తెలిపారు.

కొత్తూరులో ఎరువుల కోసం పాట్లు

కొత్తూరు: కొత్తూరులో ఎరువుల కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. మండలంలోని 27 గ్రామ సచివాలయాలకు కొత్తూరు, పారాపురం, దిమిలి గ్రామ సచివాలయాలకు 20 టన్నుల చొప్పున యూరియాను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే సోమవారం యూరియా విక్రయిస్తున్నట్లు కొత్తూరు గ్రామ సచివాలయం వ్యవసాయ సహాయకురాలు చెప్పడంతో రైతులు యూరియా కోసం పెద్ద సంఖ్యలో వ్యవసాయ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. యూరియా తక్కువ రావడంతో అందరికీ ఇబ్బంది తప్పలేదు. రైతులు ఎక్కువ కావడంతో వారి ఆధార్‌ కార్డు నంబర్లు రాసుకుని యూరియా కోసం చీటీలు ఇచ్చి మంగళవారం యూరియా పంపిణీ చేస్తామని రైతులను పంపించారు.

‘పచ్చి రొట్ట ఎరువుతో  మట్టికి జీవం’ 1
1/2

‘పచ్చి రొట్ట ఎరువుతో మట్టికి జీవం’

‘పచ్చి రొట్ట ఎరువుతో  మట్టికి జీవం’ 2
2/2

‘పచ్చి రొట్ట ఎరువుతో మట్టికి జీవం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement