
బాసూ.. ఇది లోకల్ పాసు!
పలాస నియోజకవర్గంలో ఇసుకాసురులు బరి తెగించారు. ఇసుకను ఇష్టానుసారం రవాణా చేసేందుకు ఏకంగా తమ వాహనాలకు స్టిక్కర్లు అతికించి లోకల్ పాస్‌ను రూపొందించుకున్నారు. లారీలకు ఆ స్టిక్కర్లు అతికిస్తే చాలు అధికారులు కూడా వదిలేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు ఈ స్టిక్కర్ల కథ ఏమిటో పరిశీలిస్తే..
జిల్లాలో ఎక్కడా లేని విధంగా పలాస నియోజకవర్గంలో మాత్రం లారీలకు స్టిక్కర్లు అతికించి ఇసుక అక్రమ రవాణా చేపడుతూ ట్రాక్టర్ ఇసు క రూ.ఐదు వేలకు విక్రయిస్తున్నారు. పలాసలో సుమారు 50 ఇసుక లారీలు ఉన్నాయి. ఈ లారీలు రాత్రి బయల్దేరి ఇసుక రీచ్‌కు చేరుకొని వేకువజామున పలాస చేరుకొని ఏదో ఒక ప్రాంతంలో డంప్ చేసి తద్వారా ట్రాక్టర్లకు రూ.ఐదు వేలకు విక్రయాలు జరుపుతున్నాయి. నిబంధనల మేరకై తే లారీ యాజమాని ఆధార్ కార్డు చూపించి ఇసుక రీచ్‌ల నుంచి తీసుకురావాల్సి ఉండగా యాజమానులు డమ్మీ ఆధా ర్ కార్డులను వినియోగిస్తూ ఇష్టారాజ్యంగా అక్రమంగా ఇసు క రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడ్డావని నిలదీస్తే సమాధానంగా స్టిక్కర్ చూపిస్తున్నారు. స్టిక్కర్ చూపించి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని ఎదురు తిరుగుతుండడం విశేషం. ఈ స్టిక్కర్ కోసం లారీ యాజమాని నెలకు ఒకసారి కొంత ముడుపు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం నెలంతా ఎన్నిసార్లు ఇసుక ఎత్తుకెళ్లినా అడిగే వారుండరు. అసలు ఈ స్టిక్కర్లు లారీ యాజమానులుకు ఎవరు సరఫరా చేస్తున్నారు. ఆ డబ్బులన్నీ ఎవరి జేబులకు వెళ్తున్నాయి అనే లెక్కలు తేలాల్సి ఉంది. –కాశీబుగ్గ

బాసూ.. ఇది లోకల్ పాసు!

బాసూ.. ఇది లోకల్ పాసు!