
కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు
భేషరతుగా క్షమాపణ చెప్పాలి
గూడూరు జెడ్పీ చైర్ పర్సన్‌పై దాడిని ఖండిస్తున్నాం. ఆమెకు కూటమి నాయకు లు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాలి.
– చింతు అన్నపూర్ణ, జెడ్పీటీసీ, నరసన్నపేట
●
● రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి
● గూడూరు జెడ్పీ చైర్‌పర్సన్‌కు క్షమాపణ చెప్పాలి
నరసన్నపేట: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళా ప్రజాప్రతినిధులపైనే దాడులు చేస్తున్నారని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు జీవీ రమణి ప్రశ్నించారు. ఇలాంటి క్రూరమైన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. గూడూరు జెడ్పీ చైర్‌పర్సన్ హారికపై కూటమి నాయకులు, కార్యకర్తలు పోలీ సుల సమక్షంలో దాడులు చేయడం, ఆమెను తీవ్రంగా అవమానించడాన్ని మహిళలు అంద రూ ఖండిస్తున్నారని అన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో సోమవారం సాయంత్రం మహిళలు నిరసన ర్యాలీ చేశారు. వైఎస్సార్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జీవీ రమణి మాట్లాడుతూ ఇంకెన్నాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఇంకా కూటమి దాహం తీరలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యా ప్తంగా ఇలా దాడులు జరుగుతుంటే హోం మంత్రి ఏం చేస్తున్నారు అని మండిపడ్డారు.కార్యక్రమంలో నరసన్నపేట, సారవకోట జెడ్పీటీసీలు చింతు అన్నపూర్ణ, వరుదు నాగేశ్వరమ్మ, పోలా కి ఎంపీపీ ముద్దాడ దమయంతి, పొందర కార్పొరేషన్ మాజీ ౖచైర్‌పర్సన్ రాజాపు హైమావతి, ఎంఎంఎస్ మాజీ అధ్యక్షురాలు చింతు శ్రీదేవి, బొరిగివలస సర్పంచ్ బగ్గు జగదీశ్వరి, సవర శైలజ ఎం. సుధ, ఉమ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఖండించాలి
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒక జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌పై పోలీసుల సమక్షంలో దాడి జరగడం కంటే ఘోరం ఇంకేం ఉంటుంది.
– ముద్దాడ దమయంతి, ఎంపీపీ, పోలాకి
నిందితులను అరెస్టు చేయాలి
మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులపై జరుగుతున్న దాడులు వెంటనే ఆపాలి. దాడికి దిగిన వారిపై కాకుండా హారిక బంధువులపై కేసులు పెట్టడం శోచనీయం. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.
– వరుదు నాగేశ్వరమ్మ, జెడ్పీటీసీ, సారవకోట

కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు

కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు

కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు