నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే ప్రత్యక్ష ఆందోళనే | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే ప్రత్యక్ష ఆందోళనే

Jul 15 2025 12:03 PM | Updated on Jul 15 2025 12:03 PM

నిరుద

నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే ప్రత్యక్ష ఆందోళనే

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాల ని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్‌, కొన్న శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా పరిషత్‌ కార్యాల యం వద్ద పీజీఆర్‌ఎస్‌ ఎదురుగా ధర్నా చేశా రు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, లేదంటే ప్రత్యక్ష ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నాయకులు వేణు, వసంతరావు, అన్నాజీ, రామోజీ తదితరులు పాల్గొన్నారు.

జీడిపప్పునకు జాతీయ గౌరవం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం జిల్లా ప్ర తిష్టను దేశవ్యాప్తంగా చాటుతూ పలాస జీడిపప్పు వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ (ఓడీఓపి) కింద ఉత్తమ ఉత్పత్తిగా ఎంపికై జాతీయ స్థాయిలో గొప్ప గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ అవార్డును ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అందుకున్నారు. ఈ అవార్డును కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, కేంద్ర వస్త్రోత్పత్తుల శాఖ మంత్రి జితిన్‌ ప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత కలిసి కలెక్టర్‌కు ప్రదానం చేశారు. జిల్లా ఉద్యానవన శాఖ అధి కారి ప్రసాదరావు కూడా హాజరయ్యారు. ఈ అవార్డు రాష్ట్ర ఉద్యాన రంగానికే మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసించారు. అనంతరం ఢిల్లీలోనే కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడును కలెక్టర్‌ కలిశారు.

పాతపట్నం గురుకుల పాఠశాలలో జ్వరాలు

పాతపట్నం: పాతపట్నం ప్రహరాజపాలెంలో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో 22 మంది విద్యార్థినులు జ్వరాల బారిన పడ్డారు. దీంతో గంగువాడ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యులు పూర్ణిమ వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలను నిర్వహించారు. సోమవారం ఉదయం తహసీల్దార్‌ ఎన్‌.ప్రసాదరావు, ఎంపీడీఓ పి.చంద్రకుమారిలు పాఠశాలకు చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్‌ కె.అనిత గురుకుల పాఠశాలకు డీఎంహెచ్‌ఓ ఉదయం 12 గంటలకు పాఠశాలకు చేరుకుని సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, బైదలాపురం, చాపర, మెళియాపుట్టి, బొంతు పీహెచ్‌సీ వైద్యులతో పాఠశాలలోని 453 మంది విద్యార్థినులకు మలేరియా టెస్టులు చేయించారు. నలుగురిని పాతపట్నం సీహెచ్‌సీకి పంపించారు. మూడు రోజులు వైద్య శిబిరం నిర్వహించాలని సూచించారు.

నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే ప్రత్యక్ష ఆందోళనే 1
1/1

నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే ప్రత్యక్ష ఆందోళనే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement