
● 600 ఎకరాల వరి.. నీరు లేక తడారి
పచ్చటి పొలాలు కళ్ల ముందే తడారి ఎడారిలా మారిపోతున్నాయి. వంశధార అధికారుల నిర్వాకంతో దాదాపు 600 ఎకరాల పొలాలకు నీరు అందడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. మండలంలోని కొండవలస గ్రామంలో సైలా డ చెరువు ఆయకట్టు కింద సుమారు 600 ఎకరాలు రైతులు సాగు చేస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం, గార మండలాల రాజకీయ నేతల నుంచి అధికారులకు ఒత్తి ళ్లు రావడంతో వంశధార కుడి కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. కానీ విడుదల చేసిన కొద్ది గంటల్లోనే నీరు నిలిపివేశారు. పూడిక తీత పనులు పూర్తి కాకపోవడంతో ఆపేశామని చెబుతు న్నారు. దీంతో రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా ఎండి పోతున్న తమ పొలాల వద్ద నిరసనలు తెలిపారు. ఈ సమయంలో సాగునీటిని అందించకపోతే తమ పొలాలు ఎందుకూ పనికిరావ ని ఆందోళన వ్యక్తం చేశారు. వంశధార కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. – సరుబుజ్జిలి