పస్తులు ఉండలేక | - | Sakshi
Sakshi News home page

పస్తులు ఉండలేక

Jul 10 2025 8:12 AM | Updated on Jul 10 2025 8:12 AM

పస్తు

పస్తులు ఉండలేక

అన్నం తినలేక..
● మధ్యాహ్న భోజనంలో పురుగులు ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ● పట్టించుకోని అధికారులు

కంచిలి: మండలంలోని కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వండుతున్న అన్నంలో పురుగులు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ సన్నబియ్యంతో వండిన అన్నంలో కొద్ది రోజులుగా పురుగులు వస్తుండడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూరగాయల అన్నం, ఉడకబెట్టిన కోడిగుడ్డు, బంగాళ దుంపలు కూర, వేరుశనగ చిక్కిను వడ్డించారు. అయితే కూరగాయల అన్నంలో కొందరు విద్యార్థులకు పురుగులు దర్శనమిచ్చాయి. ఇక్కడ కొద్దిరోజులుగా ఇదేవిధంగా అన్నంలో తెల్లటి పురుగులు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు.

రెండో‘సారీ’

ఇటీవల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి వెంకటేశ్వర పాణిగ్రాహి బియ్యాన్ని తనిఖీ చేసి, మొదటి బ్యాచ్‌లో సరఫరా చేసిన రెండు ప్యాకెట్ల పాత నిల్వ ఉన్న బియ్యాన్ని వెనక్కి తీసుకెళ్లారు. అయితే రెండో బ్యాచ్‌లో మళ్లీ సరఫరా చేసిన బియ్యంలో కూడా తెలుపు, నలుపు రంగుల్లో పురుగులు వస్తున్నాయని వంట చేస్తున్న ఏజెన్సీ మహిళలు తెలిపారు. దీనిపై పాఠశాల హెచ్‌ఎంకు సమాచారం ఇవ్వడంతో ఆయన స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రతిరోజు విద్యార్థులకు పెడుతున్న అన్నంలో పురుగులు వస్తుండడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్నాం

గత కొద్దిరోజులుగా సన్నబియ్యం సరఫరా చేసిన వాటిలో పురుగులు వస్తున్నాయి. ఈ విషయంపై విద్యార్థులు, పాఠశాల వంట ఏజెన్సీవారి నుంచి ఫిర్యాదులు అందడంతో స్వయంగా పరిశీలించాను. దీంతో బియ్యాన్ని చేటలతో శుభ్రంచేసి వండమని సూచించాను. అయినప్పటికీ తెలుపు రంగు పురుగులు వండిన తర్వాత బయటపడుతున్నాయి. బియ్యాన్ని మార్చాల్సిందిగా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్నాం.

– ఎన్‌.చాణక్య,

హెచ్‌ఎం, కంచిలి జెడ్పీహెచ్‌ స్కూల్‌

అన్నం తినలేకపోతున్నాను

ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఈ అన్నం తినలేకపోతున్నాను. తింటుంటే ముద్ద దిగడం లేదు. ఆకలికి తట్టుకోలేక తినక తప్పడం లేదు.

– పి.గంగాధర్‌, ఆరో తరగతి విద్యార్థి

కూరగాయల అన్నంలో పురుగు

బుధవారం పాఠశాల మధ్యాహ్న భోజనం మెనూలో వడ్డించిన కూరగాయల అన్నంలో నల్లటి పురుగులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ప్రతిరోజూ ఇదేవిధంగా పురుగులు వస్తున్నాయి. దీంతో సరిగా అన్నం తినలేకపోతున్నాం.

– ఎల్‌.చందు, ఆరో తరగతి విద్యార్థి

పస్తులు ఉండలేక 1
1/3

పస్తులు ఉండలేక

పస్తులు ఉండలేక 2
2/3

పస్తులు ఉండలేక

పస్తులు ఉండలేక 3
3/3

పస్తులు ఉండలేక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement