
మాట తప్పిన నాయకులను నిలదీద్దాం..!
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పిన కూటమి నాయకులను నిలదీద్దామని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. జిల్లాలోని పలాస, ఆమదాలవలస నియోజకవర్గాల్లో ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలను బుధవారం నిర్వహించారు. దీనిలో భాగంగా బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ క్యూ ఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు కుంభా రవిబాబు, మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి, పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్టీ తూర్పు కాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. – ఆమదాలవలస/కాశీబుగ్గ

మాట తప్పిన నాయకులను నిలదీద్దాం..!