
రౌడీ షీటర్ కుంగ్ ఫు శేఖర్‌తో వాసు జరిపిన ఫోన్ సంభాషణ
కుంగ్ ఫు శేఖర్: చేశావా..
చల్ల వాసు: హా చేశాను.. వచ్చేమను అదేటి అవ్వదు లే.. సాయంత్రం వచ్చిమను అంటున్నాడు..
కుంగ్ ఫు శేఖర్ : ఆ...
చల్ల వాసు : ఆయన సాయంత్రం వచ్చీమన్నారు. నీకు ఏమీ చేయడట. కానీ తరవాత మాత్రం జాగ్రత్తగా ఉండమన్నాడు.
కుంగ్ ఫు శేఖర్ : హ.. హ.. హ..
చల్ల వాసు : స్టేషన్ బెయిల్ ఇస్తామన్నారు..
కుంగ్ ఫు శేఖర్ : ఇప్పుడు పంపనా..
చల్ల వాసు : ఇప్పుడు వద్దు. సాయంత్రం రమ్మన్నాడు. నేను కూడా ఊరులో లేను. వైజాగ్‌లో ఉన్నాను. సాయంత్రం వస్తా
కుంగ్ ఫు శేఖర్ : అలాగ కాదె..
చల్ల వాసు : ఆ సెక్షన్‌లో ఆ క్లాజ్ లన్నీ చెప్పాను నేను పోలీసులకు. మీకు ఎందుకు నేను చేసి పెడతాను కదా అన్నాడు. తర్వాత జా గ్రత్తగా ఉండమను. ఎక్కడా బయటపడవద్దు అని అన్నాడు.. ఏమైనా అ టెండ్ అవుతాడు అని అంటే .. ఇప్పుడు వద్దు సాయంత్రం వచ్చిన తర్వాత నేను చెప్తాను అప్పుడు ఉంచు అని చెప్పాడు.
కుంగ్ ఫు శేఖర్ : అయితే నువ్వు ఈవెనింగ్ ఊరు లోకి వచ్చేస్తావా అన్నా..
చల్ల వాసు : ఇప్పుడు వచ్చేస్తా బయలుదేరి.
కుంగ్ ఫు శేఖర్ : అయితే నువ్వు వచ్చిన తర్వాత వెళ్దామా.. చల్ల వాసు : హా వెళ్దాం.. కుంగ్ ఫు శేఖర్ : ఇద్దరం కలిసి వెళ్దామా.. చల్ల వాసు : హా వెళ్దాం.. సరే