
నారాయణరావు నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న పడాల నారాయణరావు(84) అనారోగ్యంతో మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుమారులు పి.శ్రీనివాస్, పి.శ్రీకాంత్, కుమార్తె పి.శ్రీదేవిలు విషయం రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేశారు. డాక్టర్ కె.సుధీర్ పర్యవేక్షణలో మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్‌చార్జి పి.సుజాత, పి.చిన్నికృష్ణల ద్వారా కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి పంపించారు. దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్‌తో పాటు కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గాశ్రీనివాస్‌లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు సంప్రదించాలని కోరారు.
అలరించిన గజల్స్ గానలహరి
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం రంగస్థల కళాకారుల నెలవారీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో 309వ నెలవారి కార్యక్రమం బాపూజీ కళామందిర్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన గజల్ కళాకారుడు వాసుదేవాచారి సినారె గజల్స్‌ను చక్కగా గానం చేశారు. ముందుగా కార్యనిర్వాహక అధ్యక్షులు పన్నాల నర్సింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన సభలో రిటైర్డ్ సెట్‌శ్రీ సీఈవో బి.వి.ప్రసాదరావు, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావులు మాట్లాడుతూ ప్రతినెలా పేద కళాకారులను ప్రోత్సహించడం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో కళాకారుల సమాఖ్య సభ్యులు బి.రామచంద్రదేవ్, కంచరాన అప్పారావు, అగతమూడి సింహాచలం, ఇంజరాపు రమణారావు, పైడి సత్యవతి, బండారు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

నారాయణరావు నేత్రాలు సజీవం