
సాఫీగా రెండో రోజు అడ్మిషన్ల ప్రక్రియ
ఎచ్చెర్ల: ఆర్టీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లకు 2025–26 సంవత్సరానికి జరుగుతున్న అడ్మిషన్లలో భాగంగా నూజివీడు ఎస్‌ఏజీ ఆడిటోరియంలో రెండోరోజు గురువారం అడ్మిషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 547 మంది విద్యార్థులకు కాల్ లెటర్లు పంపించారు. విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశా రు. మొత్తం అడ్మిషన్ల ప్రక్రియను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, ప్రవేశాల కన్వీనర్ అచార్య సండ్ర అమరేంద్రకుమార్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘అన్యాయంగా విధుల నుంచి తొలగించారు’
సరుబుజ్జిలి: అధికార పక్ష నేతలకు అనుకూలంగా వ్యవహరించలేదనే నెపంతో అన్యాయంగా విధుల నుంచి తొలగించారని సింధువాడ ప్రాథమిక పాఠశాల మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు ఊటపల్లి చిన్నమ్మడు వాపోయారు. ఈ మేరకు గురువారం పాఠశాల ఆవరణలో నిరసన తెలిపారు. సుమారు 25 ఏళ్లు గా మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలిగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖ అధికారులు తన సంతకాన్ని తెల్లకాగితంపై తీసుకొని తనను మోసగించి అడ్డదారుల్లో విధుల నుంచి తొలగించారని తెలిపారు. ఇదే వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నానని, అధికారులు న్యాయం చేయాలని కోరారు.
సేవలు సంతృప్తి
కలిగించాలి: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల సంతృప్తే ప్రభుత్వ పాలనకు ప్రామాణికమని, అందుకే ప్రతి శాఖ కూడా ప్రజల అభిప్రాయాలను నిక్షిప్తంగా గుర్తించి, సేవలను మరింత మెరుగుపరిచే దిశగా పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయం నుంచి గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ జిల్లా నుంచి ఆయా శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం సూర్య ఘర్, స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర, బంగారు కుటుంబం వంటి కార్యక్రమాల అమలు, ప్రజల్లో సానుకూల ధోరణి పెంపొందించడంపై ప్రత్యేకంగా చర్చించారు. సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శాఖ ప్రజలకు సేవలందించే విధానం ఆత్మవిశ్వాసంతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు.
కుదిరిన జీడి కార్మికుల వేతనాల ఒప్పందం
మందస: జీడి కార్మికుల వేతనాల ఒప్పందం గురువారం జరిగింది. గత ఏడాది మే నేలలో జరగాల్సిన వేతనాల ఒప్పందం చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి 41 రోజుల పాటు పని ఇవ్వకుండా కార్మికులకు ఇబ్బందులకు గురి చేసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు జరిగాయి. చివరికి యాజమాన్యం, కార్మికులకు మధ్య వేతనాల ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. గతంలో ఇస్తున్న వేతనాలపై కిలోకు 2.50 పెంచుతూ రెండేళ్లకు ఒప్పందం జరిగింది.
చరణ్ అదరగొట్టాడు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన అట్టాడ చరణ్ భారత వాలీబాల్ ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. బెంగళూరు వేదిక గా ఎన్‌ఎస్‌ఎస్‌సీ అకాడమీలో జరగనున్న శిక్షణ శిబిరాల్లో పాల్గొనే ఇండియన్ ప్రాబబు ల్స్ జాబితాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రామనాథ్ చౌదరి విడుదల చేశారు. ఈ యువ క్రీడాకారుడు పలా స మండలం అంతరకుడ్డ గ్రామం ప్రస్తుతం విఽశాఖపట్నంలోని సాయ్ స్పోర్ట్స్ స్కూల్/హాస్టల్‌లో ఇంటర్ చదువుతున్నాడు.

సాఫీగా రెండో రోజు అడ్మిషన్ల ప్రక్రియ

సాఫీగా రెండో రోజు అడ్మిషన్ల ప్రక్రియ