ఆర్తులను కాపాడుదాం | - | Sakshi
Sakshi News home page

ఆర్తులను కాపాడుదాం

Jun 14 2025 10:18 AM | Updated on Jun 14 2025 10:18 AM

ఆర్తు

ఆర్తులను కాపాడుదాం

అపోహలు వీడుదాం..

శ్రీకాకుళం కల్చరల్‌: దాతలు కావాలి.. రక్త దాతలు ముందుకు రావాలి. జిల్లాలో రక్తల నిల్వలు నానాటికీ తక్కువైపోతున్నాయి. దాతలు ముందుకు రాకపోతే గర్భిణుల దగ్గర నుంచి ప్రమాద బాధితుల వరకు చాలా మంది ప్రాణాపాయ స్థితిలో పడతారు. రక్తదానంపై అవగాహన విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

జిల్లాలో రెడ్‌క్రాస్‌తో పాటుగా ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలో 3 ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకులు, నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో బ్లడ్‌బ్యాంకులు ఉన్నాయి. వాటన్నింటి ద్వారా రక్త సేకరణ ఏడాదిలో కేవలం 16వేల యూనిట్లు మాత్రమే జరుగుతోంది. జిల్లాకు దాదాపు 60వేల యూనిట్లు అవసరం ఉంటుంది. దీనిపై రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు మాట్లాడుతూ ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సి ఉందని చెప్పారు. తమ బ్లడ్‌బ్యాంకులో కూడా కూడా రక్తం అందడం కష్టంగా ఉందన్నారు.

అపోహలు వద్దు..

● చాలా మంది రక్తదానం అంటే భయపడతారు. దీనిపై చాలా అపోహలు ఉన్నాయి.

● రక్తదాన ప్రక్రియలో కేవలం 300 మిల్లీలీటర్లు మాత్రమే సేకరిస్తారు.

● సాధారణంగా మనిషిలో సరాసరి 5లీటర్ల నుంచి 6లీటర్ల రక్తం ఉంటుంది. కేవలం 300 మిల్లీలీటర్ల రక్తం దానం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. సుఖప్రసవంలో తల్లి 700 మిల్లీలీటర్ల రక్తం కోల్పోతుంది.

నేడు రక్తదాతల దినోత్సవం

రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు రక్తదానంపై ఆవశ్యకత కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తారు.

రక్తదానం ఆవశ్యకత

తెలియజేస్తున్నా

రక్తదానంపై స్కూళ్లకు, కళాశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు కుడా వెళ్లి వారిని రక్తదాన శిబిరాల కోసం ప్రోత్సహిస్తున్నాను. ఇప్పటికి లక్షకుపైగా మోటివేషన్‌ చేశాను. నేను కూడా ఇప్పటికి 25 సార్లు రక్తదానం చేశాను.

– పెంకి చైతన్యకుమార్‌, రెడ్‌క్రాస్‌ మోటివేటర్‌

జిల్లాకు ఏడాదికి దాదాపు 60వేల యూనిట్ల రక్తం అవసరమవుతుంది. కానీ సేకరిస్తున్నది మాత్రం కేవలం 16 యూనిట్లే. ఈ వ్యత్యా సాన్ని సరిదిద్దడం చిటికెలో పని. కానీ ఎందుకనో ఆ పని జరగడమే లేదు. దాతలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి రక్తదానం చేస్తే కొరతను ఇట్టే అధిగమించవచ్చు. కానీ అవగాహన లేమి, భయం, సమాచార లోపం కారణంగా రక్తదానం చేసేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. ఈ భయం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం అందకుండాపోతోంది.

ఎవరు రక్తదానం చేయవచ్చు..

కాసింత దయాగుణం.. మరికాసింత ఆరోగ్యం.. ఈ రెండూ ఉంటే చాలు.. 18–60 ఏళ్ల వారెవరైనా 45 కిలోలకు పైగా బరువు ఉండి, 12 పాయింట్లు హిమోగ్లోబిన్‌ ఉంటే ఎంచక్కా రక్తదానం చేయవచ్చు.

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

జిల్లాలో తగ్గుతున్న రక్త నిల్వలు

దాతలు ముందుకు రావాలని స్వచ్ఛంద సంస్థల పిలుపు

సాటి మనిషిని కాపాడాలనే..

నేను 49 సార్లు రక్తదానం చేశాను. ఏటా ఆగస్టు 15, మే 1, రిపబ్లిక్‌ డే, డిసెంబరు 25 పుట్టిన రోజున ఇస్తుంటాను.

– కేకేవీ పురుషోత్తమరావు(కల్యాణ్‌),

విశ్రాంత మెడికల్‌ రిప్రజెంటేటివ్‌, శ్రీకాకుళం

ప్రతి మూడు నెలలకు ఇస్తాను..

నేను ప్రతి మూడు నెలలకు ఓ సారి రక్తదానం చేస్తుంటాను. మొ దట్లో నాకూ భయం ఉండేది. మా మేనేజర్‌ను చూసి స్ఫూర్తి పొందాను. రెడ్‌క్రాస్‌ పలుసార్లు అవార్డులు, సత్కారాలు కూడా చేశారు.

– సీహెచ్‌ రమణమూర్తి, శ్రీకాకుళం

అపోహలు వదలండి

రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి. ఎ వరైనా రక్తదానం చేయవ చ్చు. ఆపద సమయంలో రక్తం ఎంతో అవసరం. దాన్ని గుర్తించండి.

– పి.జగన్మోహనరావు, చైర్మన్‌, రెడ్‌క్రాస్‌

ఆర్తులను కాపాడుదాం 1
1/5

ఆర్తులను కాపాడుదాం

ఆర్తులను కాపాడుదాం 2
2/5

ఆర్తులను కాపాడుదాం

ఆర్తులను కాపాడుదాం 3
3/5

ఆర్తులను కాపాడుదాం

ఆర్తులను కాపాడుదాం 4
4/5

ఆర్తులను కాపాడుదాం

ఆర్తులను కాపాడుదాం 5
5/5

ఆర్తులను కాపాడుదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement