
సంబరాలు ఆ శాఖవి..
పండగలేమో ఊరివి..
● కుందువానిపేటలో మద్యం విక్రయాలకు వేలంపాట
● రూ.4లక్షలకు పాట దక్కించుకున్న వైనం
● దొడ్డిదారిన అనుమతులు ఇస్తున్న ఎకై ్సజ్ అధికారి
● పట్టించుకోని ఉన్నతాధికారులు
శ్రీకాకుళం రూరల్:
కల్లేపల్లి, కణుగులవాని పేట పంచాయతీల్లో మరో వారం రోజుల్లో అమ్మవారి పండుగలు జరగనున్నాయి. అలాగే ఈ నెల 20న బలివాడ, కుందువానిపేట గ్రామాల్లో సైతం అమ్మవారి పండుగలకు గ్రామపెద్దలు శ్రీకారం చుట్టారు. గమ్మత్తు ఏమిటంటే పండగలు మాత్రమే ఊళ్లవి.. అసలు సంబరాలు ఎకై ్సజ్ శాఖవి. పండగ రోజుల్లో బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలకు ఎకై ్సజ్ అధికారులు దగ్గరుండి వేలంపాట పాడించారు. నెల రోజుల కిందట కుందువానిపేట గ్రామానికి చెందిన కొందరు ఊరిపాటలో ఏకంగా రూ.4లక్షలకు బెల్టుషాపును నిర్వహించేందుకు పాటను కైవసం చేసుకున్నారు. ఈ గ్రామం నుంచి చుట్టు పక్కల గ్రామాలు సైతం బాటిల్‌పై ఎంత పెంచి అమ్మినా ఇక ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోరు. ఈ ఊరిపాటను ధిక్కరించి కొత్త బెల్టుషాపులు పెడితే మాత్రం ఎకై ్సజ్ అధికారులు ఫైన్‌లు వసూలు చేసేలా ఆ గ్రామపెద్దలు నిర్ణయం చేశారు.
ప్రతి వైన్‌షాపులోనూ అదనపు ధరలు
ప్రస్తుతం శ్రీకాకుళం రూరల్ మండలాల్లో గల కల్లేపల్లి, రాగోలు, సింగుపురం, ఎస్‌ఎస్‌వలస, వప్పంగి, అలికాం గ్రామాల్లో వైన్‌షాపులకు కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక అనుమతులు ఇచ్చారు. ఈ షాపులను అనుసరించి విక్రయిస్తున్న మద్యంకు అదనంగా ప్రతి బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక వైన్‌షాపుల నుంచి బెల్ట్‌షాపులు వెళ్లే కొద్దీ ఒక్కో బాటిల్‌పై దూరాభారాన్ని బట్టి రూ. 20 నుంచి రూ.50 వరకు లాగేస్తున్నారు. ఈ వేలంపాటలు, నిర్ణయాలు అన్నీ ఎకై ్స జ్ అధికారి కనుసన్నల్లోనే జరగడం గమనార్హం. ఇంత వ్యవహారం జరిగినా ఎకై ్సజ్‌శాఖ ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
పరిశీలిస్తాం..
గ్రామాల్లో బెల్టు షాపులు గానీ, ఊరిపాటలకు గానీ ఎలాంటి అనుమతులు లేవు. ఎమ్మార్పీ ధర కంటే అధికంగా వైన్‌షాపుల్లో ఎవరైనా అధిక వసూళ్లకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్య లు తీసుకుంటాం. ఎకై ్సజ్ శాఖలో ఏ అధికారైనా బెల్డుషాపుల నిర్వహణ, ఊరిపాటల్లో పాల్గొని ఉంటే అలాంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం.
– తిరుపతినాయుడు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్

సంబరాలు ఆ శాఖవి..