ధ్రువపత్రాలు సిద్ధమేనా.. | - | Sakshi
Sakshi News home page

ధ్రువపత్రాలు సిద్ధమేనా..

May 5 2025 8:22 AM | Updated on May 5 2025 11:41 AM

ధ్రువ

ధ్రువపత్రాలు సిద్ధమేనా..

హిరమండలం: పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ తదితర పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఉన్నత చదువుల్లో భాగంగా కళాశాలల్లో చేరేందుకు పలు ధ్రువపత్రాలు తప్పనిసరి. వీటినిముందస్తుగా పొందేందుకు ఇదే మంచి తరుణమని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో రానున్న విద్యార్థుల కోసం సంబంధిత కార్యాలయాల్లోనూ అవసరమైన అన్ని పత్రాల అందజేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒత్తిడి పెరగకముందే..

సాధారణంగా మే, జూన్‌ నెలల్లో ముఖ్యంగా తహసీల్దార్‌ కార్యలయాల్లో సిబ్బందిపై ధ్రువపత్రాల జారీకి సంబంధించి అధిక ఒత్తిడి ఉంటుంది. దరఖాస్తుదారుల రద్దీ పెరుగుతుంటుంది. వీఆర్వో, ఆర్‌ఐల క్షేత్ర స్థాయి పరిశీలన, డిజిటల్‌ సంతకాలు తదితర పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు పలుమార్లు తిరగాల్సిరావడం, మధ్యవర్తులను ఆశ్రయించడం వంటి ఇబ్బందులు రావచ్చు. ఫలితంగా అనుకున్న సమయానికి ధ్రువపత్రాలు చేతికి అందకపోవచ్చు. ముందుగా మేల్కొంటే హైరానా తప్పుతుందని అధికారులు చెబుతున్నారు.

ధ్రువపత్రాలు పొందాలంటే..

● ప్రస్తుతం చదువుతున్న క్లాసుల నుంచి తదుపరి తరగతుల్లో ప్రవేశానికి ఆదాయం, కులం, ఈడబ్ల్యూస్‌, ఓబీసీ వంటి ధ్రువపత్రాలు తప్పనిసరి. వీటి కోసం మీ–సేవా కేంద్రాలు, సచివాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

● ఆధార్‌, రేషన్‌ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలతో సంబంధిత అర్జీ పూర్తిచేసి అవసరమైన నకలను జతపర్చి సచివాలయం డిజిటల్‌ సహయకుడికి అందజేయాలి.

● ఆన్‌లైన్‌లో పొందపరిచిన వివరాలపై వీఆర్వో క్షేత్ర స్థాయిలో, మండల రెవెన్యూ ఇన్‌స్టెక్టర్‌ (ఆర్‌ఐ)నేరుగాను పరిశీలిస్తారు. అన్నీ పక్కాగా ఉంటే చివరిగా తహసీల్దార్‌ తన లాగిన్‌లో మరోసారి నిశితంగా పరిశీలించి డిజిటల్‌ సంతకం చేస్తారు. దీనిపై మొబైల్‌కు వచ్చే సందేశంతో దరఖాస్తుదారులు సచివాలయంలో గానీ, మీసేవా కేంద్రంలో గానీ ధ్రువపత్రాలు పొందవచ్చు

దరఖాస్తు చేసుకోండి..

కళాశాలలు, వృత్తి విద్యా కోర్సుల్లో చేరే సమయంలో అవసరమయ్యే ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుంటే మేలు. చివరి సమయంలో హడావుడి పడుతూ ఆందోళన చెందకుండా ప్రస్తుత సెలవుల్లోనే కార్యాలయాలను సంప్రదించాలి. కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీకి నిర్దేశించిన సమయం కంటే ముందు వీటిని జారీచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.

– ఎన్‌.హనుమంతురావు,

తహసీల్దార్‌, హిరమండలం

కుల, ఆదాయ తదితర సర్టిఫికెట్లకు ఇదే సమయం

విద్యాసంస్థల్లో ప్రవేశాలు నేపథ్యంలో ముందస్తుగా సిద్ధం కావడం మేలు

ధ్రువపత్రాలు సిద్ధమేనా..1
1/2

ధ్రువపత్రాలు సిద్ధమేనా..

ధ్రువపత్రాలు సిద్ధమేనా..2
2/2

ధ్రువపత్రాలు సిద్ధమేనా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement