
50 ఏళ్ల తర్వాత బేసి పోలమ్మ అమ్మవారి సంబరాలు
సోంపేట: మండలంలోని బేసి రామచంద్రాపురం గ్రామంలోని బేసి పోలమ్మ అమ్మవారి గ్రామ దేవత సంబరాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. తొమ్మిది రోజుల పాటు సంబరాలు నిర్వహించనున్నారు. యాభై ఏళ్ల తర్వాత గ్రామంలో ఉత్సవాలు నిర్వహిస్తుండడంతో అంతటా పండగ వాతావరణం నెలకొంది. 5 నుంచి 13వ తేదీ వరకు ప్రతి రోజూ రాత్రి 9 గంటల తర్వాత గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 5న రాజమండ్రి వారి డ్యాన్స్ ఈవెంట్స్, 6న ఒడిశా వారి సాంస్కృతిక కార్యక్రమాలు, 7న కండక్టర్ ఝాన్సి, రమేష్ మాస్టర్ స్టేజ్ ఈవెంట్స్, 8న ఒరియా రామాయణం, 9న పల్సర్ బైక్ రమణ ఈవెంట్స్, 10న ప్రకాష్ మాస్టారు గ్రూప్ డ్యాన్స్‌లు, 11న విశాఖపట్నం రోషన్‌లాల్ ఆర్కెస్ట్రా, 12న బుల్లెట్ భాస్కర్ టీమ్ జబర్దస్త్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జోగిపోలమ్మ సిరిమాను పండగలు
టెక్కలి: టెక్కలి మండలం పరశురాంపురం గ్రామంలో సోమవారం నుంచి గ్రామదేవత జోగిపోలమ్మ సిరిమాను పండగలు జరగనున్నాయి. దశాబ్దాల తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సర్పంచ్ కోరాడ కామేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు దేవర ఉత్సవంతో పాటు 13వ తేదీ సిరిమాను సంబరం, అమ్మవారి ఘటాల ఊరేగింపుతో 9 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. దశాబ్దాల తర్వాత నిర్వహిస్తున్న ఉత్సవాల కోసం సుదూర ప్రాంతాల నుంచి బంధువులంతా గ్రామానికి చేరుకోవడంతో సందడి చోటు చేసుకుంది. ఉత్సవాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

50 ఏళ్ల తర్వాత బేసి పోలమ్మ అమ్మవారి సంబరాలు

50 ఏళ్ల తర్వాత బేసి పోలమ్మ అమ్మవారి సంబరాలు