
ఉద్యోగ భద్రత కల్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ ఆస్పత్రుల్లో పనిచేసే మిడ్ లెవెల్ హెల్త్ అధికారులు సమస్యల పరిష్కారం కోరుతూ రోడ్కెక్కారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో తొలుత సమావేశం నిర్వహించారు. అక్కడి జ్వోతిరావు పూలే పార్కు వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టరేట్ గేటు వద్ద ధర్నా చేపట్టారు. చిన్నారులు, కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. మిడ్‌వెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సు అసోషియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఎం.ఉషారాణి, పి.ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.