
విధి నిర్వహణలో అలసత్వం తగదు
జి.సిగడాం: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు. గురువారం జి.సిగడాం మండలం వాండ్రంగి పింఛన్ల పంపిణీని పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు. రహదారిపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా ఇంటి సామగ్రి వేస్తే వాహనాలు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. ప్రతిఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించేలా చర్యలు తీసుకోవా లని ఏపీఓ చోళ్ల సత్యనారాయణకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌరీశంకరరావు, సర్పంచ్ సాకేటి నాగరాజు, ఎంపీటీసీ సభ్యులు బూరాడ శ్రీదేవి, బూరాడ వెంకటరమణ, తహసీల్దార్ ఎం.శ్రీకాంత్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏఈఈలు కుసుమ, సత్యనారాయణ, ఏపీఎం రెడ్డి రామకృష్ణంనాయుడు పాల్గొన్నారు.