
బధిరులకు టచ్ ఫోన్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మీకోసం వినతుల స్వీకరణ కార్యాక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా ఐదుగురు బధిరులకు టచ్ ఫోన్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత తదితరులు ఉన్నారు.
స్వాతీసోమనాథ్‌కు ఐకాన్ అవార్డు
శ్రీకాకుళం కల్చరల్: హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కళాదర్బార్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సంప్రదాయ గురుకులం డైరెక్టర్ స్వాతీ సోమనాథ్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయం బృందం సభ్యులు యామిని, బలరామ్, లోకేశ్వరి, అంజలి, లిఖిత, తేజస్వి, హేమాంజలి, హేమవ ల్లి, జోషిత, శ్రీజ, భవ్య, భానులు చక్కటి ప్రదర్శనతో ఆహూతులను అలరించారు.
రెండు ఆవులు మృతి
బూర్జ: మండలంలోని అన్నంపేటలో పేడాడ రంగారావుకు చెందిన రెండు పాడి ఆవులు మృతి చెందినట్లు కొల్లివలస పశువైద్యాధికారి డాక్టర్ జి.వెంకటరావు సోమవారం తెలిపారు. గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు పశువులు తినే దాణాలో విషం కలపడం వల్ల మృతిచెందినట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.80 వేలు వరకు ఉంటుందని చెప్పారు.

బధిరులకు టచ్ ఫోన్లు

బధిరులకు టచ్ ఫోన్లు